`RRR`.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరిది. తెలుగోడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటిన సినిమాగా ఈ మూవీని హాలీవుడ్ స్టార్స్ కొనియాడుతున్నారు. దర్శకుడు రాజమౌళితో పాటు ఇందులో నటించిన స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో అవార్డుని దక్కించుకోవడం.. ఆ వెంటనే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో రెండు విభాగాల్లో పురస్కారాల్ని సొంత చేసుకోవడంతో RRR పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.
వరల్డ్ వైడ్ గా ఇప్పడు హాట్ టాపిక్ గా మారిన బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా వసూళ్ల పరంగానూ రూ. 1200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం పలు అంతర్జాతీయ వేదికలపై పురస్కారాల సొంతం చేసుకుంటూ ఆస్కార్ పై ఆశల్ని చిగురింప జేస్తోంది. ఈ మూవీ `నాటు నాటు` సాంగ్ కి గానూ విదేశీ చిత్రాల విభాగంగాలో ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ చేయబడిన విషయం తెలిసిందే.
ఈ మూవీ కోసం హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ఫ్యామిలీలతో కలిసి యుఎస్ కు వెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి పాల్గొని సందడి చేశారు. అంతే కాకుండా ఆస్కార్ బరిలో సినిమా నిలవడంతో దీని ప్రమోసన్స్ కోసం అమెరికాలోని పలు కీలక మీడియా సంస్థలతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అయితే ఇదింతా అక్కడి ఓ ఏజెన్సీ ఆర్గనైజ్ చేసిందట. అంతే కాకుండా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన హంగామా పలు హాలీవుడ్ మేకర్స్ దృష్టికి తీసుకెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఇద్దరు స్టార్ లకు వేరు వేరు హాలీవుడ్ సంస్థల్లో ఆఫర్లు ఇప్పించడానికి సదరు ఏజెన్సీ గట్టిగానే ట్రై చేస్తోందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే రామ్ చరణ్, ఎన్టీఆర్ హాలీవుడ్ ప్రాజెక్ట్ ల ఆఫర్లని దక్కించుకోవడం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే వీరి ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ సినీ లవర్స్ కి గుడ్ న్యూస్ అని నెట్టింట ప్రచారం మొదలైంది. ఇందులో వున్న నిజమెంత?.. నిజంగానే హాలీవుడ్ సంస్థలు మన హీరోల కోసం ఆఫర్లు ఇవ్వడానికి రెడీగా వున్నాయా? అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.