ప్రభాస్ ఒక్క ఏడాదిలో అన్ని కోట్లు వదులుకున్నాడా..?

Update: 2021-06-23 11:36 GMT
యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో దేశవిదేశాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అందుకే ఇప్పుడు ప్రభాస్ ప్రతి సినిమాని అన్ని ఇతర భాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డార్లింగ్ క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికి పలు వ్యాపార సంస్థలు.. అతన్ని బ్రాండ్‌ అంబాసిడర్‌ గా చేసుకోవాలని చూస్తున్నాయి. భారీ అమౌంట్ ఆఫర్ చేసినప్పటికీ ప్రభాస్‌ మాత్రం వీటిపై పెద్దగా ఆసక్తి చూపించలేదట. ఈ క్రమంలో ప్రభాస్ గడిచిన ఏడాది 150 కోట్ల రూపాయల వరకు వదులుకున్నాడని తెలుస్తోంది.

ప్రభాస్ బ్రాండ్ ఎండార్స్మెంట్స్ వదులుకోడానికి వరుస సినిమాలతో బిజీగా ఉండటం ఒక కారణమైతే.. తనకున్న ప్రేక్షకాదరణ దృష్టిలో పెట్టుకొని ఏది పడితే అది ఓకే చేయకూడదని నిర్ణయించుకోవడం మరో కారణమని తెలుస్తోంది. అందుకే 'బాహుబలి' సినిమా తర్వాత చాలా పెద్ద కంపెనీలు ప్రభాస్ కు భారీ ఆఫర్స్ ఇచ్చినప్పటికీ.. ఆయన సున్నితంగా తిరస్కరించారట. కోట్ల రూపాయల ఎండార్స్మెంట్స్ వదులుకున్న ప్రభాస్.. తాను నటించే సినిమాలకు భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ.. ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా ఎదిగారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో 'రాధేశ్యామ్‌' సినిమా చేస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో రెండు ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ''సలార్''.. ఓంరౌత్‌ దర్శకత్వంలో ''ఆదిపురుష్‌'' సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ తో ఓ పాన్ వరల్డ్ చేయనున్నాడు. ఇలా ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్‌ ని పట్టాలెక్కిస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్.


Tags:    

Similar News