విల్లా కోస‌మే రాజ్ త‌రుణ్ ఆ సినిమాలు చేశాడా?

Update: 2022-12-16 14:41 GMT
యంగ్ హీరో రాజ్ త‌రుణ్ `అనుభ‌వించు రాజా`, `స్టాండ‌ప్ రాహుల్‌` వంటి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌ని ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. తాజాగా జీ5 కోసం `అహ‌నా పెళ్లంట‌`తో ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. రీసెంట్ న‌వంబ‌ర్ 17 నుంచి ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా వుంటే విల్లా కోస‌మే రాజ్ త‌రుణ్ ఒకే సంస్థ నిర్మించిన ఆ సినిమాలు చేశాడా? అనే కామెంట్ లు తాజాగా వినిపించాయి.

ఈ కామెంట్ ల‌పై తాజాగా రాజ్ త‌రుణ్ వివ‌ర‌ణ ఇచ్చాడు. ఆ వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని, తాను విల్లా కోస‌మే ఆ సినిమాలు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశాడు. రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ `కిట్టూ వున్నాడు జాగ్ర‌త్త‌, అంధ‌గాడు, రాజు వున్నాడు జాగ్ర‌త్త‌.. వంటి మూడు సినిమాల‌ని ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో చేశాను. విల్లా కోస‌మే ఈ మూడు సినిమాలు చేయ‌లేదు. పారితోషికంగా డ‌బ్బులు తీసుకుంటే ఖ‌ర్చు చేస్తాన‌ని, అలా కాకుండా విల్లా తీసుకుంటే బాగుంటుంద‌ని రాజా ర‌వీంద్ర స‌ల‌హా ఇచ్చాడు.

త‌ను ఇచ్చిన స‌ల‌హా మేర‌కే ఈ మూడు ప్రాజెక్ట్ ల‌తో వ‌చ్చిన డ‌బ్బుతో విల్లా కొనుగోలు చేశాను. అంతే కానీ విల్లా కొనాల‌నే మూడు ప్రాజెక్ట్ లు చేయ‌లేద‌ని క్లారిటీ ఇచ్చాడు రాజ్ త‌రుణ్‌. ఇక కారు యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ .. మ‌ద్యం సేవించి తాను కారు న‌డ‌ప‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదు. అందులో ఎలాంటి నిజం లేద‌న్నాడు.

మ‌ణికొండ‌లో మా ఇంటి ద‌గ్గ‌ర్లోనే నాకు తెలిసిన ఓ స్నేహితుడు వుండేవాడ‌ని, ఒక రోజు రాత్రి స‌మ‌యంలో వాళ్లింటికి ర‌మ్మ‌న్నాడ‌ని, అత‌ని కోసం కారులో వెళుతున్న‌ప్పుడు అనుకోకుండా రోడ్డుప‌క్క‌న గోడ‌ను ఢీకొట్టాన‌ని, అది జ‌రిగింది కూడా మా ఇంటి ప‌క్క‌నేన‌ని తెలిపాడు.

ఆ క్ష‌ణం నాకెంతో కంగారుగా అనిపించింద‌ని, వెంట‌నే కారు దిగి ఇంటికి ప‌రుగెత్తాన‌న్నాడు. ఇంటికి వెళితే ఎవ‌రో ఒక‌రు నాకు సాహాయం చేస్తార‌ని వెళ్లాన‌ని, అంతే కానీ నేను పారిపోలేద‌న్నాడు. గోడ‌ను ఢీకొట్టిన దానికి నాకు జ‌రిమానా విధించారు. అది క‌ట్టాను కూడా.. దాంతో ఆ ఎపిసోడ్ అయిపోయింది` అని వివ‌ర‌ణ ఇచ్చాడు రాజ్ త‌రుణ్‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News