రెహ‌మాన్ ముందు చైనావోడు అంత‌మాట అన్నాడా?

Update: 2022-04-12 07:30 GMT
'దేశ భాష‌లందు తెలుగు లెస్స' అన్న‌ది మ‌న ప్రాతీయ అభిమానం. అన్ని భాష‌ల క‌న్నా తెలుగు భాష తియ్య‌న‌ది. ఇది ప్ర‌తీ తెలుగు వాడి నినాదం. ఇలా ఎవ‌రి ప్రాంతీయ అభిమానం వారికుంటుంది. అలాగే సంగీత ద‌ర్శ‌కుడు ఏ.ఆర్ రెహ‌మాన్  కూడా త‌న మాతృభాష త‌మిళంపై మ‌రోసారి అభిమానం చాటుకున్నారు. అన్ని భాష‌ల‌క‌న్నా త‌మిళ భాషే తియ్య‌నైన‌ది అన్నారు. ఆంగ్ల భాష‌కు బ‌ధులు దేశ ప్ర‌జ‌లంతా హిందీ భాష మాట్లాడాలి అని కేంద్ర హోమంత్రి అమితాషా చేసిన  వ్యాఖ్య‌లు హిదీయేత‌ర రాష్ర్టాల్లో ఎంత దుమారం రేపుతుందో తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో రెహ‌మాన్ ట్విట‌ర్ వేదిక‌గా  షా వ్యాఖ్య‌ల‌పై కౌంట‌ర్ వేసారు. త‌మిళ భాషే తియ్య‌నైన‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆదివారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో రెహ‌మాన్ ని ఐకాన్ అవార్డుతో స‌త్క‌రించారు.  ఈ వేడుకల్లో కేంద్ర  స‌మాచార ప్ర‌సార శాఖ స‌హాయ మంత్రి మురుగ‌న్ స‌హాప‌లువురు అతిదులు పాల్గొన్నారు. ఈ వేడుక‌లో భాగంగా త‌న‌కెదురైన వింత అనుభ‌వాన్ని రెహ‌మాన్ మీడియాతో పంచుకున్నారు.

''ఏడేళ్ల క్రితం మ‌లేషియాలో చైనా వ్య‌క్తి మీది ఇండియా క‌దా? అన్నారు. అప్పుడ‌త‌ను నాకు నార్త్ ఇండియ‌న్స్  అంటే చాలా ఇష్టం. వాళ్లు చాలా అందంగా ఉంటారు. వారు న‌టించిన సినిమాలు చాలా బాగుంటాయి అన్నారు. బ‌హుశా అత‌ను ద‌క్షిణాది సినిమాలు చూసి ఉండ‌డు. అందుకే అలా అని ఉంటాడ‌ని అర్ధ‌మైంది. కానీ ఆ మాట‌లు న‌న్ను చాలా బాధించాయి. ఉత్త‌రాది-ద‌క్షిణాది అనే బేధం ఉండ‌కూడ‌దు. మ‌న‌మంతా ఇండియ‌న్స్ .

నా వ‌ర‌కూ అలాంటి బేధం లేదు. నాకు రెండు భాష‌ల సినిమాలు రెండు క‌ళ్లు లాంటివి' అన్నారు. ఆ ర‌కంగా  అమితా షా వ్యాఖ్య‌ల‌పైనా ప‌రోక్షంగా  స్పందించారు. కానీ మ‌ళ్లీ అన్ని భాష‌ల‌క‌న్నా త‌మిళ భాషే తియ్యనైన‌దని...భాష గొప్ప‌ద‌నాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన 'సైరా న‌ర‌సింహారెడ్డి' సినిమాకి ముందుగా రెహాన్ ని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేసుక‌న్న సంగ‌తి తెలిసిందే.

రెహ‌మాన్ ఒకే చెప్ప‌డంతోనే సైరా టీమ్ అధికారికంగా అత‌ని పేరుని వెల్ల‌డించింది. కానీ  తీరా సినిమా మొద‌ల‌య్యే స‌రికి బిజీ షెడ్యూల్ కార‌ణంగా త‌ప్పుకుంటున్న‌ట్లు రెహ‌మాన్  ప్ర‌క‌టించి షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో రెహ‌మాన్ ఎగ్జిట్ పై చాలా ఆరోప‌ణ‌లు  తెరపైకి వ‌చ్చాయి.  ఈసినిమాకి తెలుగు డైరెక్ట‌ర్ ప‌నిచేయ‌డం స‌హా ఇత‌ర కొన్ని కార‌ణాలుగా రెహ‌మాన్ త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. తాజాగా రెహ‌మాన్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో నాటి సంగ‌తిని తెలుగు ఆడియ‌న్స్ గుర్తు స్మ‌రించుకోవ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం.
Tags:    

Similar News