యూట్యూబ్ .. సోషల్ మీడియా మాధ్యమాల్లో కేజీఎఫ్ 2 టీజర్ హవా కొనసాగుతోంది. రిలీజైన కేవలం 24 గంటల్లోనే 10 కోట్ల (100 మిలియన్లు) లైక్ లు .. 50 లక్షల (5మిలియన్లు) వ్యూస్ తో ఈ టీజర్ సంచలనం సృష్టించింది. ఈ దూకుడు ఇప్పటికీ అలానే కొనసాగుతుండడం చూస్తుంటే కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలకు తెర తీయనుందోనన్న విశ్లేషణ మొదలైంది.
ఇప్పటికిప్పుడు కేజీఎఫ్ 2 థియేటర్లలోకి వస్తే సెన్సేషనల్ హిట్ ఖాయం అన్నంత ప్రామిస్సింగ్ టీజర్ ని అందించారు ప్రశాంత్ నీల్- హోంబలే బృందం. రాకింగ్ స్టార్ యష్ మరోసారి రాకింగ్ పెర్ఫామెన్స్ తో భారీ యాక్షన్ తో కట్టి పడేయనున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. మరోవైపు అధీరా (సంజయ్ దత్) లుక్ అటు హిందీ బెల్టులోనూ కాకలు పుట్టిస్తోంది.
ఒకవేళ కేజీఎఫ్ 2 రిలీజైతే `బాహుబలి: ది కంక్లూజన్` రికార్డులు కొట్టేస్తుందా? ఆర్.ఆర్.ఆర్ కి ఇది సవాల్ గా మారనుందా? అన్న చర్చా తాజాగా విశ్లేషకుల్లో మొదలైంది. టీజర్ కి జనం నుంచి నిజాయితీగా స్పందన వచ్చినట్టే థియేటర్లకు క్యూ కడితే అదేమంత కష్టం కాకపోవచ్చన్న అంచనా వేయడం చూస్తుంటే టీజర్ మాయాజాలం ఎలా పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. బహుశా ట్రైలర్ తో వేడిని మరింతగా పెంచేస్తారనడంలో ఎలాంటి సందేహాలు లేవు.
నిజానికి ఇటీవలి కాలంలో ఇంత హైప్ వచ్చిన వేరొక టీజర్ లేనే లేదు. బహుశా మళ్లీ జక్కన్న రూపొందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ టీజర్ వచ్చినప్పుడు మాత్రమే మళ్లీ అంత హైప్ కనిపిస్తుందేమో చూడాలి. కేజీఎఫ్ చాప్టర్ 1 రిలీజ్ నాటికి ఎలాంటి హైప్ లేదు. కానీ చాప్టర్ 2 రిలీజ్ కి ముందే అంచనాలు అతి భారీగా పెరిగాయి. ఇంకా చెప్పాలంటే అన్ లిమిటెడ్ గా హైప్ పెరిగిందని అర్థమవుతోంది.
ఈసారి కన్నడం- హిందీలోనే కాదు.. తెలుగు-తమిళం-మలయాళంలోనూ కేజీఎఫ్ 2 సంచలనాలు సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది. మహమ్మారీ క్రైసిస్ నుంచి వందశాతం బయటపడి సజావుగా థియేటర్లలో రిలీజైతే కేజీఎఫ్ చాప్టర్ 2 సంచలనాలు బాక్సాఫీస్ వద్ద అంత కష్టమేమీ కాకపోవచ్చన్న అంచనా ఏర్పడింది. ఒక రకంగా ఇది ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి గోల్ ని సెట్ చేయడమేనని విశ్లేషిస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి అండ్ టీమ్ బహుశా ఈ విషయాన్ని అవగతం చేసుకునే ఉండొచ్చు. ఇక బాహుబలి సిరీస్ ని మించి ఆర్.ఆర్.ఆర్ ని బ్లాక్ బస్టర్ చేసేందుకు సంచలనాల్ని ఆవిష్కరించేందుకు రాజమౌళి అండ్ టీమ్ అహోరాత్రులు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 రికార్డుల్ని కొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగినా ఇప్పటివరకూ ఎవరి వల్లా కాలేదు. మళ్లీ ఆ రికార్డుల్ని ఆర్.ఆర్.ఆర్ తో జక్కన్ననే బ్రేక్ చేయాలని భావించారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్-యష్ బృందం నుంచి కేజీఎఫ్ 2 కూడా అంతే పెద్ద సవాల్ విసురుతోందన్న విశ్లేషణ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వేడెక్కిస్తోంది.