టాలీవుడ్ లో అగ్ర హీరోల నటవారసులే బెర్త్ ని ఖాయం చేసుకోలేని పరిస్థితి. కొందరు ఇప్పటికీ సక్సెస్ లేక ఆపసోపాలు పడుతున్నారు. ఇలాంటి ఇండస్ట్రీలో రవితేజ-నాని లా బ్యాక్ గ్రౌండ్ తో పని లేకుండా దూసుకొచ్చే ట్యాలెంట్ కి కొదవేమీ లేదు. యువహీరో రాజ్ తరుణ్ 'ఉయ్యాల జంపాల'తో ఆరంగేట్రమే బంపర్ హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రాజ్ తరుణ్ సడెన్ గా రవితేజలానే డైరెక్టర్ కాబోయి హీరో అయిపోయి విజయాన్ని ఒడిసిపట్టాడు. దాంతో వరుసగా ఆఫర్లు వెంటపడ్డాయి. కానీ అతడు బ్యాడ్ ఎంపికలతో ఫ్లాపుల బాట పట్టడం.. రేసులో వెనకబడడం ఇటీవల చర్చనీయాంశమైంది.
నిజానికి సరైన కథల ఎంపికలు కెరీర్ కి ఎంతో కీలకమైనది. కానీ రాజ్ తరుణ్ ఇందులో విఫలమయ్యాడని కూడా కథనాలు వచ్చాయి. ఇటీవల రాజ్ తరుణ్ తో చాలా మంది నిర్మాతలు ప్రాజెక్ట్ లను వదులుకోవడానికి కారణాలు అనేకం అని కథనాలొచ్చాయి. నిజానికి అప్పట్లో దిల్ రాజు 'శతమానం భవతి' అనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఈ చిత్రాన్ని ప్లాన్ చేసి తొలిగా రాజ్ తరుణ్ కే కథ వినిపంచారు. కానీ చివరికి అతడి స్థానంలో శర్వానంద్ ని హీరోగా తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్ తరుణ్ ఒక యువ దర్శకుడితో కొత్త సినిమా ప్రారంభించి వెంటనే మరొక దర్శకుడిని మార్చారని కథనాలొచ్చాయి. కొత్త దర్శకుడి స్థానంలో మరో కొత్త వాడిని తీసుకోవడం చర్చకు తెర తీసింది. డైరెక్షన్ లో అతిగా జోక్యం చేసుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. ఇవన్నీ స్వయంకృతం అంటూ ప్రచారమైంది. పెద్ద స్టార్ అయిపోయిన రాజ్ తరుణ్ నిర్మాతలను పట్టించుకోవడం లేదని కూడా ప్రచారం సాగింది. అయితే రాజ్ తరుణ్ స్వయంకృతాపరాధమా ఇది అంటే .. ?
నిజానికి యువహీరో కొన్ని విషయాల్లో తెలివైన ప్రణాళికలను కలిగి ఉన్నాడని తెలిసింది. అతడి ప్రతిభపై అభిమానులకు గొప్ప నమ్మకం. అందులో రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు అతడి ప్రతిభను కొనియాడిన తీరును బట్టి అతడికి ఇంకా ఎంతో భవిష్యత్ ఉందనడంలో సందేహం లేదు. ఇంతకీ రాజ్ తరుణ్ కెరీర్ రన్ కి కీలక వ్యక్తి అయిన రాజా రవీంద్ర సహకారం పై రాజ్ తరుణ్ కొన్ని టాప్ సీక్రెట్స్ ని చెప్పారు.
తనకి మెంటార్ గా పనిచేస్తున్న రాజా రవీంద్ర తన స్థిరత్వానికి సహకరించారని రాజ్ తరుణ్ తాజాగా వెల్లడించారు. మూడు సినిమాల ప్యాకేజీగా వచ్చిన సంపాదనతో యువ నటుడు తెలివిగా ఒక 'లగ్జరీ విల్లా'పై పెట్టుబడి పెట్టడానికి కారణం రాజా రవీంద్ర అని తెలిపారు. నిర్మాత అనిల్ సుంకరతో ఇంతకుముందు మూడు సినిమాలకు సంతకం చేశానని.. ఆ డబ్బును పనికిమాలిన పనులకు వెచ్చిస్తున్నానని తెలిసి రాజా రవీంద్ర బలవంతంగా సంపాదనను దుర్వినియోగం చేయకుండా విల్లా కొనిపించాడని తెలిపాడు. ప్రస్తుతం అదే విల్లాలో తాను నివాసం ఉంటున్నట్టు వెల్లడించాడు. నిజానికి నిర్మాత అనిల్ సుంకరతో ఒకే ఒక్క సినిమా చేద్దామని అనుకున్నాం. మొదటి సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు కథలు నా దగ్గరకు వచ్చాయి. మూడు సినిమాలు వరుసగా చేస్తానని అనీల్ సుంకర అన్నారు. అలా మూడింటికి ఒకే ప్యాకేజీలా అందుకున్నాను. అదే నిర్మాత విల్లా కొనుక్కునేలా సహకరించారని రాజ్ తరుణ్ ఓ చాటింగ్ సెషన్ లో వెల్లడించారు.
అనీల్ సుంకరతో వరుసగా అందగాడు- కిట్టు ఉన్నాడు జాగ్రత్త-రాజుగాడు చిత్రాలకు రాజ్ తరుణ్ పని చేసాడు. కానీ ఇవేవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు. ఈ సినిమాలు ఫ్లాపులవ్వడం నిరాశపరిచింది. దీనిపైనా వివరణ ఇచ్చాడు రాజ్ తరుణ్. తన నిర్ణయంలో రాజా రవీంద్ర అంతగా జోక్యం చేసుకోరని కథలు విని నేనే నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. స్క్రిప్టును తాను ఓకే చేశాక దానికి మరింత వ్యాల్యూని జోడించేందుకు ప్రయత్నిస్తాడని తన సహాయకుడు రాజా రవీంద్రను కొనియాడాడు రాజ్ తరుణ్. ఆ మూడు ఫ్లాపుల్లో నటించేప్పుడే 'శతమానం భవతి' లాంటి బ్లాక్ బస్టర్ లో నటించే ఛాన్స్ మిస్సయినా కానీ .. తనకు ఖరీదైన 'విల్లా' దక్కడం వెనక ఆనందం ఉందని ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు రాజ్ తరుణ్. దీనికి కారకులు తన నిర్మాతలేనని వారికి ఎనలేని గౌరవాన్ని ఇచ్చాడు. ఇకపై కెరీర్ పరంగాను రాజ్ తరుణ్ కంబ్యాక్ అయ్యేందుకు ఏం చేస్తున్నారో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.