బాలీవుడ్ లో సక్సెస్ అయిన పింక్ సినిమా తమిళం మరియు తెలుగు రీమేక్ రైట్స్ ను దక్కించుకున్న బోనీ కపూర్ కోలీవుడ్ లో అజిత్ తో సొంతంగా నిర్మించాడు. కాని టాలీవుడ్ లో మాత్రం దిల్ రాజుకు నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు. పెట్టుబడి పెట్టకుండా తన రీమేక్ రైట్స్ నే పెట్టుబడిగా పెట్టి వకీల్ సాబ్ కు సమర్పకుడిగా వ్యవహరించాడు. వకీల్ సాబ్ సినిమాతో బోనీ కపూర్ కు బాగానే గిట్టుబాటు అయినట్లుగా సమాచారం. కేవలం రీమేక్ రైట్స్ తోనే మంచి లాభాలను దక్కించుకున్న బోనీ కపూర్ ప్రస్తుతం హిందీలో అజయ్ దేవగన్ తో మైదాన్ సినిమాను నిర్మిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉండగా తౌక్తే తుఫాన్ వల్ల భారీ నష్టం జరిగిందట.
మైదాన్ కోసం భారీ ఎత్తున వేసిన ఒక సెట్టింగ్ తుఫాన్ దాటికి పూర్తిగా నాశనం అయ్యిందట. ఆ సెట్టింగ్ ను మళ్లీ పునర్ నిర్మించాలంటే చాలా ఖర్చు అవుతుందని మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే మైదాన్ సినిమా ను భారీ మొత్తంతో నిర్మిస్తున్నారు. అనుకున్న బడ్జెట్ కంటే ఈ సినిమాకు ఎక్కువ ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో సెట్టింగ్ తుఫాన్ దాటికి నాశనం అవ్వడంతో మళ్లీ పునర్ నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. వకీల్ సాబ్ తో వచ్చిన లాభాలను మైదాన్ సినిమాకు బోనీ కపూర్ పెట్టాల్సి వస్తుందట.
తుఫాన్ వల్ల భారీగా నష్టం మిగలడంతో వకీల్ సాబ్ లాభంను అటుగా బోనీ కపూర్ మల్లించాల్సి వచ్చిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. థియేట్రికల్ రైట్స్.. ఓటీటీ.. శాటిలైట్ రైట్స్ ద్వారా భారీ ఎత్తున వకీల్ సాబ్ చేసిన బిజినెస్ ద్వారా బోనీ కపూర్ కు భారీ గానే ముట్టింది. అది కాస్త ఇప్పుడు తుఫాన్ దాటికి నష్టపోయిన సెట్టింగ్ కు పెట్టాల్సి వచ్చిందంటూ ఆయన సన్నిహిత వర్గాల నుండి సమాచారం అందుతోంది.