త్రివిక్రమ్.. టాలీవుడ్ హిరాని అట

Update: 2017-12-20 08:02 GMT
‘అతడు’ అనే ఒక్క సినిమాతో దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయనపై తెలుగు ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో త్రివిక్రమ్ సక్సెస్ కాలేదు. ‘అతడు’ అవ్వగానే తీసిన ‘జల్సా’ ఆశించిన స్థాయిలో లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. తర్వాత ‘ఖలేజా’ పూర్తిగా నిరాశ పరిచింది. ‘జులాయి’తో కొంచెం పుంజుకుని.. ఆపై ‘అత్తారింటికి దారేది’తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు త్రివిక్రమ్.

ఐతే ఈ సినిమా తీయడానికి ముందు దిల్ రాజు త్రివిక్రమ్ కు ఫోన్ చేశాడట. ఆయన స్థాయికి తగ్గ సినిమాలు చేయట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడట. త్రివిక్రమ్.. బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని స్థాయి దర్శకుడని.. మనసు పెట్టి రాస్తే ఆయనలాగే గొప్ప సినిమాలు తీయగలరని రాజు అభిప్రాయపడ్డాడట. ఈ విషయం త్రివిక్రమ్ కు గట్టిగా చెప్పాడట దిల్ రాజు. తాను ఆ మాటలు చెప్పాక త్రివిక్రమ్ నుంచి ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిందని దిల్ రాజు చెప్పాడు.

దశాబ్దంన్నర కిందట పవన్ కళ్యాణ్ ‘బద్రి’ అనే సినిమా చేశాడని.. ఆ సినిమాకు ఒక పోస్టర్ లేదని.. ఆడియో లాంచ్ కూడా లేదని.. ఏ పబ్లిసిటీ లేకుండా సినిమాను రిలీజ్ చేశారని.. అయినప్పటికీ ఆ సినిమా చాలా పెద్ద హిట్టయిందని.. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’కి భారీ పబ్లిసిటీ చేస్తున్నారని.. పైగా పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదని.. ఇది వీళ్లకు హ్యాట్రిక్ హిట్ అవుతుందని.. 2018 సంవత్సరానికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశాడు. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో దిల్ రాజే పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News