సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎఫ్ 2' చిత్రం ఊహించని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఏకంగా 60 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఈమద్య కాలంలో దిల్ రాజు బ్యానర్ లో అత్యధిక లాభాలు దక్కించుకున్న చిత్రంగా 'ఎఫ్ 2' నిలిచింది. అందుకే దిల్ రాజు తన ఆఫీస్ స్టాప్ కు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ను ఇచ్చాడు. హైదరాబాద్ మరియు వైజాగ్ ఆఫీస్ లలో వర్క్ చేసే కీలకమైన 20 మంది స్టాఫ్ ను బ్యాంకాక్ టూర్ కు పంపిస్తున్నాడట.
బ్యాంకాక్ టూర్ 20 మందిని పంపించడం అంటే కనీసం 25 నుండి 30 లక్షలైనా ఖర్చు అవ్వడం ఖాయం. ఎఫ్ 2 కు వస్తున్న లాభాలను పరిగణలోకి తీసుకుంటే స్టాప్ బ్యాంకాక్ టూర్ ఖర్చు పెద్ద లెక్కలోకి రాదు. అందుకే దిల్ రాజు స్టాప్ ఆనందం కోసం, వారిలో మరింత ఉత్సాహంను నింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు తన స్టాప్ కు ఇలాంటి సర్ ప్రైజ్ లు ఇవ్వడం కొత్తేం కాదు. ప్రతి సంవత్సరం బోనస్ లు, కొత్తగా సినిమా ఏదైనా తీసి మంచి సక్సెస్ అయితే చిన్న చిన్న బహుమానాలు ఇవ్వడం కామన్. ఈసారి ఏకంగా బ్యాంకాక్ టూర్ కు స్టాప్ ను పంపించబోతున్నాడు.