నిర్మాతగా మొదట్లో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలే తీశాడు దిల్ రాజు. కానీ 2008 నుంచి వరుసగా పెద్ద హీరోలతోనే సినిమాలు లాగించాడు. ఐతే 'ఎవడు' తర్వాత మళ్లీ ఇప్పుడు రాజు కళ్లు చిన్న సినిమాల మీద పడింది. గత ఏడాది అల్లు అరవింద్‌తో కలిసి 'పిల్లా నువ్వు లేని జీవితం' లాంటి మోడరేట్ బడ్జెట్ మూవీ తీసిన దిల్ రాజు.. ఈసారి ఇంకా తక్కువ పెట్టుబడితో 'కేరింత' తీశాడు. ఐతే ఈ సినిమా మొదలుపెట్టాలనుకున్నపుడు అనుకున్న బడ్జెట్ ఇంకా చాలా తక్కువ అని చెబుతున్నాడు రాజు.
'కేరింత' ఎలా మొదలైందో చెబుతూ.. ''మూడేళ్ల కిందట సాయికిరణ్ అడివి రూ.2 కోట్లతో సినిమా చేసి పెడతానంటూ నా దగ్గరికి వచ్చాడు. కథ చెప్పాడు. డిఫరెంట్‌గా ఉంది, బాగుంది అనిపించింది. ఐతే అంతకుముందు మేం తీసిన 'ఓ మై ఫ్రెండ్' సినిమాకు జనాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అందుకే మళ్లీ ప్రయోగం చేయడం ఎందుకని.. బడ్జెట్ గురించి ఆలోచించకుండా కొత్త కథ తయారు చేయించా. సినిమా మొదలుపెట్టి 30 రోజులు షూటింగ్ చేశాక.. సంతృప్తిగా అనిపించలేదు. తీసిందంతా పక్కనబెట్టేశాం. కొందరు నటీనటుల్ని కూడా మార్చాం. కథలో కూడ మార్పులు చేశాం. మొత్తానికి ఏడాది పాటు చేసిన స్క్రిప్ట్ వర్క్‌తో బెస్ట్ వెర్షన్‌ని ప్రేక్షకులకు అందించబోతున్నాం. ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం తర్వాత నా బ్యానర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ కేరింత అని నమ్మకంగా చెప్పగలను'' అన్నారు దిల్ రాజు.