దిల్ రాజు బేనర్ నుంచి సరైన సినిమా వచ్చి చాలా కాలమైంది. గత ఏడాది కేరింత.. సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి ఏవరేజ్ సినిమాలే అందించాడు దిల్ రాజు. ఈ ఏడాది ఇంకా ఖాతా కూడా తెరవలేదు. సమ్మర్ సీజన్ కోసం సుప్రీమ్ సినిమాను రెడీ చేసి పెట్టుకున్నాడు రాజు. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ అందుకుంటానని ఆశతో ఉన్న రాజు.. సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసి చేసి చివరికి మే 6వ తేదీకి ఫిక్సయ్యాడు. కానీ ఆ రోజు అనుకోకుండా సూర్య మూవీ 24 వచ్చిపడింది. అయినప్పటికీ తన సినిమాను అదే రోజు విడుదల చేయాలనే ఆలోచనతోనే ఉన్నాడు దిల్ రాజు. కానీ అఫీషియల్ గా డేట్ ప్రకటించడానికి మాత్రం జంకుతున్నాడు.
సుప్రీమ్ సినిమా మే మొదటి వారంలో విడుదల అంటూ ఈ రోజు ఓ ప్రకటన ఇచ్చాడు దిల్ రాజు. తొలి వారం అంటే ఆరో తారీఖునే సినిమా రావాలి. ఇంకో ఛాయిస్ లేదు. మరి నేరుగా ఆ డేటేదో ఇచ్చేయకుండా తొలి వారం అంటూ దాగుడుమూతలేంటో అర్థం కావడం లేదు. దిల్ రాజు గత సినిమా పోలీస్ విషయంలోనూ ఇలాగే జరిగింది. విడుదలకు మూడు రోజుల ముందు కానీ డేటివ్వలేదు. ఐతే ఆ సినిమాకున్న ఇబ్బంది వేరు. డబ్బింగ్ వర్క్ ఆలస్యం కావడం వల్ల డేట్ ప్రకటించాడానికి ఆలస్యమైంది. మరి సుప్రీమ్ విషయంలో సమస్యేంటో మరి. బహుశా బ్రహ్మోత్పవం మే 13న వస్తుందో లేదో కన్ఫమ్ అయ్యాక దాన్ని బట్టి డేట్ మార్చుకుందామని చూస్తున్నారేమో.