దిల్ రాజు సినిమాలో 'దంగల్' బ్యూటీ..!

Update: 2021-07-10 01:30 GMT
తెలుగులో హీరో నాని నిర్మించిన 'హిట్' చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన 'హిట్' సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావ్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను 'హిట్' హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - టీ సిరీస్ బ్యానర్స్ పై దిల్ రాజు - భూషణ్ కుమార్ - కిషన్ కుమార్ - కుల్దీప్ రాథోడ్‌ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

'హిట్' హిందీ రీమేక్ లో 'దంగల్' బ్యూటీ సన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగులో రుహాని శర్మ పోషించిన పాత్రలో సన్యా కనిపించనుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ.. ''#HIT టీమ్ లోకి సన్యా కు స్వాగతం'' అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సన్యా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ..''నేను 'హిట్' సినిమా చూశాను. ఈ మూవీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ  సినిమా ఆఫర్ నా వద్దకు వచ్చినప్పుడు వెంటనే ఓకే చెప్పాను. ఇది చాలా ఆసక్తికరమైన చమత్కారమైన స్టోరీ. రాజ్ కుమార్ రావ్ తో కలిసి పని చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని అన్నారు.

అమీర్ ఖాన్ 'దంగల్‌' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సన్యా మల్హోత్రా.. ఆ తరువాత 'పటాఖా' 'బధాయ్ హో' 'శకుంతలా దేవి' 'లూడో' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు తొలిసారిగా హీరో రాజ్ కుమార్ రావ్ తో కలిసి ''హిట్'' సినిమా చేయనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ చూస్తున్నారు. ఇప్పటికే 'జెర్సీ' హిందీ రీమేక్ కు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు.. 'హిట్' సినిమాతో బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నారు.
Tags:    

Similar News