ఎన్నారైలను విలన్లుగా చూపించారా?!

Update: 2017-01-17 10:27 GMT
సంక్రాంతి మూవీ శతమానం భవతికి ప్రశంసలు బోలెడన్ని వస్తున్నాయి. మానవతా విలువలు.. ఎమోషన్స్ తో కూడిన ఈ మూవీని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. చక్కని కుటుంబ కథా చిత్రం అనే అభినందనలు కూడా అందుకుంది. అయితే.. ఇదే సమయంలో కొన్ని వర్గాల నుంచి ఈ చిత్రం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ముఖ్యంగా కథ ప్రకారం చూసుకుంటే.. ఈ సినిమాలో ఎన్నారైలను విలన్లుగా చూపారని ఆరోపిస్తున్నారు. విదేశాల్లో సెటిల్ అయినవారు.. తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఏకపక్ష ధోరణితో సినిమా తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై నిర్మాత దిల్ రాజు స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించాడు. తాము ఎవరినీ.. ముఖ్యంగా ఎన్నారైలను విలన్స్ చేసి చూపించలేదని అంటున్నాడు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న కల్పిత గాధ మాత్రమే అని.. ఇండియాలోని పేరెంట్స్ ను కొడుకులు కూతుళ్లు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పడం తమ ఉద్దేశ్యం కాదని చెప్పాడు దిల్ రాజు.

సెలవలకు పిల్లలు ఇంటికి వస్తారా రారో అనే డైలమాలో ఉన్న చాలామంది పేరెంట్స్ మనసుల్లోని సందేహాలను.. తెరమీద ఆవిష్కరించామన్న దిల్ రాజు.. శతమానం భవతి ద్వారా ఎన్నారైలను అవమానించలేదని అంటున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News