టాలీవుడ్ బడా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు. దిల్ సినిమాతో కెరియర్ ప్రారంభించి కుటుంబ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని వారి టేస్ట్ కి తగ్గట్లుగా సినిమాలు నిర్మించి సక్సెస్ లు అందుకున్నాడు. అలాగే టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులని దిల్ రాజు పరిచయం చేశాడు. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి సినిమా వస్తుంది అంటే కచ్చితంగా కుటుంబం అంతా కలిసి హ్యాపీగా చూడదగ్గ సినిమా అవుతుందనే అభిప్రాయం అందరిలో ఉంది.
అయితే మారుతున్న ట్రెండ్ తో పాటు నిర్మాతగా తాను కూడా మారాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని చెప్పాలి. గత నాలుగేళ్ల కాలంలో దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఒకటి కూడా రాలేదు. హిట్ సినిమాలు వచ్చిన అవి భారీ హిట్స్ అయితే కాలేదు. ఎఫ్3 మూవీ ఒక మోస్తారుగా ఆడింది. ఇక గత ఏడాది నాగచైతన్యతో చేసిన థాంక్యూ సినిమా డిజాస్టర్ అయ్యింది. దిల్ రాజు ఎన్నో హోప్స్ పెట్టుకొని చాలా ఇష్టంతో ఆ సినిమాని నిర్మించాడు.అయితే అది ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించలేకపోయింది. రెండో రోజు నుంచే థియేటర్స్ ఖాళీ అయిపోయాయి.
ఇక తాజాగా సంక్రాంతి బరిలో వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే తెరకెక్కింది. అయితే అటు తమిళంలో కాని ఇటు తెలుగులో గాని వారసుడు మూవీ పెద్దగా మెప్పించలేదు.
ఎవరేజ్ టాక్ తో బయటపడింది. ఇక ఆడియన్స్ టేస్ట్ మారిందని ఇప్పటికే గ్రహించిన దిల్ రాజు తన కథల ఎంపికని కూడా మార్చుకుంటున్నాడు. అలాగే పాన్ ఇండియా కథలపైన దృష్టి పెట్టాడు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పొలిటికల్ థ్రిల్లర్ మూవీని 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
దీని తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో జఠాయు అనే ఫిక్షన్ థ్రిల్లర్ ని పాన్ ఇండియా లెవల్ లో నిర్మిస్తున్నాడు. అలాగే శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాని కూడా ఫైనల్ చేసాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రవణం అనే టైటిల్ తో కథని ఫైనల్ చేసినట్లు ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఇకపై పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్ లెవల్ లో భారీ చిత్రాలని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాలతోనే నెక్స్ట్ రాబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు దిల్ రాజు తన ప్రొడక్షన్ నుంచి రాబోతున్న సినిమాల లైన్ అప్ టాలీవుడ్ సర్కిల్ లో వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.