22 ఏళ్ల నా కల 'వకీల్ సాబ్'తో తీరింది: 'దిల్' రాజు

Update: 2021-04-05 03:30 GMT
కథ లక్షణాలు ఏమిటి? అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే కథలో ఏయే అంశాలు ఉండాలనేది 'దిల్' రాజుకు బాగా తెలుసు. అందువల్లనే ఆయన నిర్మాతగా తెరకెక్కించిన చిత్రాలలో సక్సెస్ అయినవాటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తాజాగా పవన్ కల్యాణ్ తో నిర్మించిన 'వకీల్ సాబ్' .. ఈ నెల 9వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'దిల్ రాజు' మాట్లాడారు.

"పవన్ కి .. నాకు సంబంధించిన విషయాల్లోకి వెళ్లాలంటే 22 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. 'తొలిప్రేమ' షూటింగు జరుగుతున్నప్పుడు ఆయనను దూరం నుంచి చూసి వచ్చేసేవాడిని .. అప్పటికి నేను చిన్న డిస్ట్రిబ్యూటర్ ని. 'తొలిప్రేమ' 100 రోజులు ఆడిన తరువాత అనిపించింది .. నిర్మాతగా మారితే కల్యాణ్ గారితో సినిమా తీయాలని. అప్పటి నుంచి కల్యాణ్ ను అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాను. ఆయనతో సినిమా చేయాలనే నాలోని కోరిక పెరుగుతూనే వస్తోంది. నా కోరిక త్వరలోనే తీరుతుందని హరీశ్ శంకర్ చెప్పేవాడు.

కల్యాణ్ గారు డేట్లు ఇస్తే చాలు సినిమాలు చేయడానికి లైన్లో చాలామంది ఉంటారు. అలాగే నేను కూడా ఆయనతో సినిమా  చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాడిని. ఆ అవకాశం నాకు 'పింక్' రీమేక్ తో దక్కింది. తమిళ రీమేక్ ను చూసినప్పుడు అజిత్ ప్లేస్ లో నేను కల్యాణ్ గారినే చూశాను. కల్యాణ్ గారైతేనే కరెక్ట్ అని హరీశ్ శంకర్ అన్నాడు. త్రివిక్రమ్ గారి ద్వారా కల్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆ తరువాత దర్శకుడిగా వేణు శ్రీరామ్ ను సెట్ చేయడం జరిగింది. అలా పవన్ తో సినిమా చేయాలనే నా 22 ఏళ్ల నా కల నిజమైంది" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News