పరిశ్రమలో అగ్రజుడిగా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. పంపిణీదారుడిగా - నిర్మాతగా - కథలు వండించే ఎనలిస్టుగా - దర్శకుల్ని తయారు చేసే ఆల్ రౌండర్ గా రాజుగారికి పేరుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నెగ్గుకొచ్చే సత్తా అతడికి ఉంది. థియేటర్ల యజమానిగా ఆయన ఎదురేలేని స్థానంలో ఉన్నారు. వీటన్నిటినీ మించి ఆయన కథల జడ్జిమెంట్ పై అందరికీ ఓ గొప్ప నమ్మకం. కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే ఆయన ఒక సినిమా కొన్నారు అంటే అందరి కళ్లు అటువైపు ఉంటాయి.
ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా గుహన్ దర్శకత్వం వహించిన `118` చిత్రాన్ని రాజుగారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఆయన 118 ప్రివ్యూ వీక్షించి తెలుగు రాష్ట్రాల హక్కుల్ని చేజిక్కించుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర పనుల్ని పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతోంది. ట్రైలర్ రిలీజై ఇప్పటికే ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ కి చక్కని స్పందన వస్తోంది. అంతేకాదు .. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఓ డిఫరెంట్ సినిమా అని తెలుస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో నెక్ట్స్ లెవల్ సినిమా అన్న టాక్ వినిపిస్తోంది. ప్రఖ్యాత ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇదివరకూ కళ్యాణ్ రామ్ నటించిన `పటాస్` చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేసి బాగానే లాభాలు అందుకున్నారు. అందుకే ఈ చిత్రాన్ని సెంటిమెంటుగా రిలీజ్ చేస్తున్నారా? లేక సినిమాలో కంటెంట్ నచ్చడం వల్లనే చేజిక్కించుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో నివేధ థామస్ - షాలిని పాండే కథానాయికలుగా నటించారు.