మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు. ఇంతకుమించి ఆ ప్రాజెక్టు గురించి ఏ క్లారిటీ లేదు. ఐతే ఆ సినిమా ఎప్పుడు మొదలైనా నైజాం హక్కులు తనవే అని ప్రకటించేశాడు దిల్ రాజు. ఆ సినిమా నైజాం రైట్స్ కోసం రామ్ చరణ్ కు తానిప్పటికే బ్లాంక్ చెక్కు ఇచ్చేసినట్లు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆడియో ఫంక్షన్ లో వెల్లడించాడు రాజు. ఐతే రేటు గురించి తానిప్పుడు మాట్లాడలేనని.. ఐతే చరణ్ తో ముందు రైట్స్ గురించి కన్ఫమ్ చేసుకోవాల్సి ఉందని చెప్పాడు. 15 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నప్పటికీ తాను చిరంజీవి సినిమాను మాత్రం పంపిణీ చేయలేకపోయానని.. తాను నిర్మాతగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే చిరంజీవి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడం చాలా నిరాశ కలిగించిందని రాజు అన్నాడు..
చిరంజీవి 150వ సినిమాను చరణ్ నిర్మిస్తాడు కాబట్టి.. ఆ తర్వాతి సినిమాను నిర్మించే అవకాశం తనకిస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని రాజు అన్నాడు. ఈ సందర్భంగా తాను పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా నిర్మించబోతున్నట్లు ఆసక్తికర విషయం చెప్పాడు రాజు. ‘తొలి ప్రేమ’ను డిస్ట్రిబ్యూట్ చేసిన రోజుల నుంచి పవన్ తో సినిమా తీయాలని కలలు కన్నానని.. కానీ ఇప్పటికీ ఆ అవకాశం కోసం నిరీక్షిస్తున్నానని.. ఐతే ఈ మధ్యే పవన్ తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఇక కథ తయారు చేసుకోవాల్సి ఉందని రాజు చెప్పాడు. పవన్ ఓకే అన్న వెంటనే తాను హరీష్ శంకర్ కే ఫోన్ చేశానని.. సాధ్యమైనంత త్వరగా కథ రెడీ చేసి.. పవన్ తో సినిమా చేయాలని పట్టుదలతో ఉన్నానని.. కచ్చితంగా మెగా బ్లాక్ బస్టర్ సినిమానే తీస్తానని రాజు అన్నాడు.