రాజు గారు రూటు మార్చారా

Update: 2019-01-22 05:32 GMT
విపరీతమైన పోటీ మధ్య మరో మూడు క్రేజీ సినిమాలు బరిలో ఉన్నా ఫైనల్ విన్నర్ గా ఎఫ్2 నిలవడం పట్ల దిల్ రాజు ఆనందం మాములుగా లేదు. ఒకటికి రెండు రూపాయలు లాభం రావడంతో బయ్యర్లు కూడా హ్యాపీగా ఉన్నారు. గత కొన్నేళ్లలో వారం తిరక్కుండానే పెట్టుబడి మొత్తాన్ని వెనక్కు ఇచ్చిన ఒకే ఒక్క స్టార్ హీరో సినిమాగా ఎఫ్2 ప్రత్యేకంగా నిలుస్తోంది. సెకండ్ హాఫ్ నడిచే ఒక్క ఫారిన్ షెడ్యూల్ మినహాయించి దిల్ రాజు దీనికి భారీగా ఖర్చు పెట్టింది ఏమి లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం హైదరాబాద్ లోనే సాగిపోయింది. అందుకే 28 కోట్ల బిజినెస్ తో సేఫ్ గేమ్ ఆడటం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు సైతం వరంగా మారింది.

సంక్రాంతి దాటినా వసూళ్లు స్టడీగా ఉండటం బలాన్ని చేకూరుస్తోంది. ఇక గత ఏడాది రెండు డిజాస్టర్లు ఒక జస్ట్ యావరేజ్ అందుకున్న దిల్ రాజు ఇకపై ఎక్కువ రిస్క్ చేయకుండా ఎఫ్2 లాంటి ఎంటర్ టైనర్స్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇలాంటి వాటిలో రిస్క్ ఫాక్టర్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ సినిమా పోయినా వివిధ మార్గాల్లో ఉన్న హక్కుల రూపంలో పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. అదే స్టార్ హీరోలతో అయితే వందల కోట్ల బిజినెస్ తో రిస్క్ తో పాటు టెన్షన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది.

అందుకే ఇకపై స్క్రిప్ట్స్ విషయంలో ఇదే ఫార్ములాను పాటించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. శర్వానంద్-సమంతాలతో ప్లాన్ చేసిన 96 రీమేక్ కూడా సేఫ్ గేమే. తెలుగుకి తగ్గట్టు ప్రస్తుతం మార్పులు చేర్పులు రాసుకునే పనిలో టీం బిజీగా ఉంది. అది అవ్వగానే షూటింగ్ మొదలుపెట్టనున్నారు. మహర్షిలో పార్ట్ నర్ షిప్ తప్ప దిల్ రాజు ఇంకే భారీ ప్రాజెక్ట్ కు కమిట్ కాలేదు. ఎఫ్2 వచ్చాక పెండింగ్ లో ఉన్న కథలను మళ్ళి వడబోసే కార్యక్రమం జరుగుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. ఏదైతేనేం మొత్తానికి దిల్ రాజును మళ్ళి బ్యాక్ టు గోల్డెన్ డేస్ లోకి తీసుకెళ్ళిన ఎఫ్2కు ఇప్పుడప్పుడే అంత ఈజీగా బ్రేకులు పడేలా లేవు.

Full View
Tags:    

Similar News