తియ్య‌డం కాదు.. అమ్ముకోవ‌డం చేత‌కావాలి

Update: 2015-11-21 09:30 GMT
ఈ డిసెంబ‌ర్ బాలీవుడ్‌ లో పెనుతుఫాన్ త‌ప్ప‌దేమో! బాలీవుడ్‌ ని ఏల్తున్న స్టార్ హీరో, త‌నదైన ఛ‌రిష్మాతో బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్స్ అందుకుంటున్న స్టార్ ప్రొడ్యూస‌ర్ కం డైరెక్ట‌ర్ మ‌ధ్య ఈసారి హోరాహోరీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. డిసెంబ‌ర్ చివ‌రి వారంలో క్రిస్మ‌స్ కానుక‌గా ఓ రెండు భారీ ప్రాజెక్టులు రిలీజ్ కి వ‌స్తున్నాయి. వీటిలో షారూక్‌ ఖాన్ -కాజోల్ జంట‌గా న‌టించిన దిల్‌ వాలే - సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భాజీరావ్ మ‌స్తానీ.. ఈ రెండూ ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ మూవీస్‌. బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయ‌న్న భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్న సినిమాలివి.

అయితే ఈ రెండిటి మార్కెటింగ్ స్ర్టాట‌జీ పూర్తిగా వేరుగా ఉంది. ఓ వైపు షారూక్‌ ఖాన్ రెడ్ చిల్లీస్ డిస్ర్టిబ్యూష‌న్ సంస్థ పంపిణీలో జెట్‌ స్పీడ్ చూపిస్తుంటే.. భ‌న్సాలీ ప్రొడ‌క్ష‌న్ మాత్రం మార్కెటింగ్ ప‌రంగా రేసులో పూర్తిగా వెన‌క‌బ‌డింది. రెడ్ చిల్లీస్ ఇప్ప‌టికే డీడీఎల్‌ జే పెయిర్ అంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేసి దిల్‌ వాలే సినిమాని ఏరియాల వైజ్‌ భారీ మొత్తాల‌కు అమ్మేస్తోంది. ఇప్ప‌టికే శాటిలైట్ పరంగా దాదాపు 60 కోట్లు సంస్థ చేతికి అందాయి. ఉత్త‌రాదిన భారీ టీవీ నెట్‌ వ‌ర్క్ మ‌ల్టీ స్ర్కీన్ మీడియా (ఎంఎస్ ఎం)కి దిల్‌ వాలే శాటిలైట్ హ‌క్కుల్ని అమ్మేశాడు. అంతేకాదు మ‌రో మూడు నాలుగు షారూక్ న‌టించిన‌ సినిమాల్ని అదే సంస్థ‌కు క‌ట్ట‌బెట్టేస్తామంటూ...  డీల్ కుదుర్చుకుంది రెడ్ చిల్లీస్‌. అలాగే మ్యూజిక్ రైట్స్ రూపంలో 19 కోట్లు ద‌క్కాయ‌ని టాక్‌.

ఇదిలా ఉంటే భాజీ రావ్ మ‌స్తానీ భారీ సెట్స్‌ - భారీ ఖ‌ర్చుతో భారీగా తెర‌కెక్కుతోంది. అయితే ఆ ఖ‌ర్చుకు త‌గ్గ‌ట్టే మార్కెట్ మాత్రం క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. బిజినెస్ ప‌రంగా ఎంక్వ‌యిరీలు బావున్నా .. ఆ సినిమా బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొడితే కానీ రిక‌వరీ చేయ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు. ఓ వైపు దిల్ వాలే రేసులో ఉంది. అయినా సెల‌వుల్లో పోటీకి రిలీజ‌వుతోంది. కాబ‌ట్టి ఈ సంస్థ రిక‌వ‌రీ సాధించాలంటే బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ అన్న టాక్ వ‌స్తేనే సాధ్యం అని చెబుతున్నారు. సినిమా తియ్య‌డం కాదు.. అమ్ముకోవ‌డం చేత‌కావాలి అనేది అందుకే.

Tags:    

Similar News