స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంగా ఓ సినిమా పేరు చెప్పండి.. అంటే వెంటనే డిడిఎల్ జే అనేస్తాం. అంతటి గుర్తింపు ఉంది ఈ సినిమాకి. ఒకే థియేటర్ లో సంవత్సరాల తరబడి ఆడిన ఏకైక సినిమా ఇది. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే (డిడిఎల్ జె) 19 అక్టోబర్ 1995లో రిలీజైంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి 20 సంవత్సరాలు పూర్తవుతుంది.
ఈ శుభ సందర్భాన యశ్ రాజ్ ఫిలింస్ కీర్తి కిరీటంలో మరో మైలు రాయి చేరబోతోంది. ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎథ్నాలజీ (దక్షిణాసియా గ్యాలరీ) ఒసాకా (జపాన్)లో స్క్రీనింగ్ చేయనున్నారని యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ రివీల్ చేసింది. రాజ్ (షారూక్ ఖాన్)- సిమ్రన్ (కాజోల్) అనే ఎన్నారై లు ఫ్రెండ్సుతో కలిసి యూరప్ అకేషన్ కి వెళ్లి ప్రేమలో పడతారు. పెద్దాళ్ల చిరాకులు పరాకుల మధ్య చివరికి తమ ప్రేమను దక్కించుకున్నారా? లేదా? అన్నదే కథాంశం.
ఆ ఏడాది మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్. ప్రేమ జంట అభినయంతో పాటు అమ్రిష్ పురి - అనుపమ్ ఖేర్ వంటి నటీనటుల ప్రదర్శన హైలైట్. ఆదిత్య చోప్రా దర్శకప్రతిభ ఇప్పటికీ డెబ్యూ డైరెక్టర్ల కు స్టడీ మెటీరియల్ లాంటిది.