ముంబైకి పిలిచి అమ్మ‌డిని లాక్ చేశాడ‌ట‌!

Update: 2020-08-11 06:00 GMT
సౌత్ లో రాణించి అటుపై ముంబై ప‌రిశ్ర‌మ‌లో స‌త్తా చాటాల‌నుకుంటారు చాలా మంది నార్త్ అమ్మాయిలు. ముంబైలో మోడ‌ల్ గా రాణించి అటుపై పెద్ద స్టార్ అవ్వాల‌న్న క‌లల్ని నిజం చేసుకునేందుకు చాలా మంది కేవ‌లం సౌత్ నే ఎందుకు ఎంచుకుంటారు? అంటే.. దానికి స‌మాధానం క్లియ‌ర్ క‌ట్ గానే ఉంది.

ఇక్క‌డ సినిమాల్ని విజిటింగ్ కార్డ్ లాగా ఉప‌యోగించుకుని ఆ క్రేజ్ తో నాలుగైదు పారితోషికాలు అందుకోవ‌చ్చు. అటుపై త‌మ‌కు ఇష్ట‌మైన బాలీవుడ్ లోనూ న‌టించ‌వ‌చ్చు. ఈ కేట‌గిరీకే చెందుతుంది వ‌రుణ్ తేజ్ క‌థానాయిక డింపుల్ హ‌యాతీ. ఈ భామ తొలుత వ‌రుణ్ స‌ర‌స‌న గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ చిత్రంలో సూపర్ హిట్ స్పెషల్ సాంగ్ ‘జర్రా జర్రా’ లో కనిపించింది. అటూపై సౌత్ లో ప‌లు చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. ప్ర‌స్తుతం హిందీ పరిశ్ర‌మ‌లో స్టార్ డైరెక్ట‌ర్ తో ఆఫ‌ర్ ద‌క్కించుకుంది.

ధనుష్, అక్షయ్ కుమార్ .. సారా అలీ ఖాన్ లాంటి క్రేజీ స్టార్ల‌తో రూపొందుతున్న బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా `అట్రాంగి రే`లో డింపుల్ ఆఫ‌ర్ ద‌క్కించుకుంది. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఈ అమ్మ‌డు న‌టించిన సినిమాల్ని చూశార‌ట‌. లుక్ టెస్ట్ కోసం ముంబైకి పిలిచాడు. టెస్ట్‌ ముగిసిన వెంటనే ధ‌నుష్ స‌ర‌స‌న త‌న‌కు అవ‌కాశ‌మిచ్చాడ‌ట‌. చిత్రంలో డింపుల్ ఒక మురికి వాడ యువ‌తి పాత్రను పోషించ‌నుంది. మ‌హ‌మ్మారీ నుంచి బ‌య‌ట‌ప‌డి.. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని స‌మాచారం.
Tags:    

Similar News