టాలీవుడ్ సెంటిమెంట్ పరిశ్రమ. ఠెంకాయ కార్యక్రమం మొదలు సినిమా రిలీజ్ డేట్ వరకూ ప్రతిదీ సెంటిమెంటుతో కూడుకున్నవే. కోట్లాది రూపాయల పెట్టుబడులతో జూదం ఆడేచోట ఇది సర్వసాధారణం. సినిమావాళ్లకు సెంటిమెంట్లు చాలా చాలా ఎక్కువ అని అనేందుకు ఇందుకే. ఇక సినిమా వాళ్లు పేర్లు మార్చుకోవడం సంఖ్యా శాస్త్రం ప్రకారం తమ పేరులోకి అదనంగా కొన్ని అక్షరాలను చేర్చడం వగైరా వగైరా మార్పులు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇదే సెంటిమెంటును ప్రముఖ దర్శకుడు బాబీ కూడా అనుసరిస్తున్నారని అర్థమవుతోంది.
నేడు దీపావళిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం టైటిల్ టీజర్ ను విడుదల చేయగా ఇందులో బాబీ పేరు మార్పు చర్చనీయాంశంగా మారింది. టీజర్ ఆద్యంతం రక్తి కట్టించగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నిండిన మెగాస్టార్ నయా లుక్ ఆకట్టుకుంది.
మాస్ కి డబుల్ ధమాకా ట్రీటివ్వడం ఖాయమని టీజర్ లుక్ వెల్లడించింది. టీజర్ క్రెడిట్స్ లో బాగా పరిశీలిస్తే... దర్శకుడి పేరు మార్పు స్పష్ఠంగా కనిపిస్తోంది. KS రవీంద్ర అనేది అసలు పేరు.
అతని మునుపటి అన్ని చిత్రాలలో అతని అసలు పేరు స్క్రీన్ పేరుగా వేసారు. కానీ ముద్దు పేరు (బాబీ) బ్రాకెట్లలో కనిపిస్తుంది. 'వాల్తేరు వీరయ్య' టీజర్ లో బాబీ పేరు బాబీ కొల్లి అని చూపించగా అసలు పేరు రవీంద్ర ను పూర్తిగా వేయకుండా మినహాయించారు. దర్శకుడి పెట్ నేమ్ బాబీ స్క్రీన్ నేమ్ గా మారగా పెట్ నేమ్ తర్వాత అతని ఇంటిపేరు కొల్లి జోడించారు.
ఇక తొలి టీజర్ తోనే బాస్ మెరుపులు మెరిపించడంతో మెగా ఫ్యాన్స్ లో ఆనందానికి అవధుల్లేవ్. మరోసారి అన్నయ్య చిరంజీవిలో గ్యాంగ్ లీడర్ - రౌడీ అల్లుడు తరహా మాస్ హీరోని చూడబోతున్నామన్న ఆనందంలో మునిగి తేల్తున్నారు. చిరు నిప్పులు విరజిమ్మే చెక్కను విసిరిన తర్వాత చివరి క్రెడిట్ లలో 'ఎ బాబీ కొల్లి సినిమా' అని కనిపిస్తుంది.
ప్రస్తుతానికి ఈ పేరు మార్పు వెనుక కారణమేమిటో కనుగొనాల్సి ఉంది. 2023 సంక్రాంతికి 'వాల్టెయిర్ వీరయ్య' బాక్సాఫీస్ వద్దకు రానుంది. ఆసక్తికరంగా సంక్రాంతి బరిలో భారీ పోటీ నడుమ ఈ చిత్రం విడుదల కానుంది. బాబీ పేరు అతనికి అన్ని విధాలా సెంటిమెంట్ ప్రకారం వర్కవుటవుతుందో లేదో కాలమే నిర్ణయించాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.