కొన్ని సినిమాలకు వాటిలో కంటెంట్ కంటే వివాదాలతోనే ఎక్కువగా పబ్లిసిటీ లభిస్తుంటుంది. ఈ మధ్య కాలంలో ఇలా వర్కవుట్ అయిన సినిమాల కౌంట్ బాగా తగ్గిపోయింది. కానీ విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి విషయంలో మాత్రం.. వివాదాలే మెయిన్ రోల్ పోషిస్తున్నాయి.
లిప్ లాక్ మేకింగ్ సీన్ నుంచి మొదలు పెట్టి.. ఆ తర్వాత లిప్ లాక్ పోస్టర్.. ఆడియో ఫంక్షన్ లో హీరో నోటి వెంట బూతులు.. వీహెచ్ ను తాతా చిల్ అనడం.. ఇలా వరుసగా వివాదాలు తెగ కలిసొచ్చేస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కు హెల్ప్ అవుతున్నాయి. అయితే.. ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీకి.. హీరో విజయ్ దేవరకొండకు డైరెక్టుగా కాకపోయినా.. ఇన్ డైరెక్టుగా పంచ్ లు వేశాడు ఓ దర్శకుడు. బ్లేడ్ బాబ్జీ.. మిస్టర్ పెళ్లికొడుకు.. కెవ్వుకేక వంటి చిత్రాలను తీసిన దేవీ ప్రసాద్.. విజయ్ దేవరకొండకు గట్టి కౌంటర్ నే వేశాడు.
"ఈ మధ్య కొందరు ఆడియో ఫంక్షన్స్ లోను.. రిలీజ్ కు ముందు ఈవెంట్స్ లోను మాట్లాడుతున్న భాష చాలా అసభ్యంగా.. అభ్యంతరకరంగా ఉంటోంది. ఇంట్లో బాత్రూంలో ఎలాగైనా స్నానం చేయచ్చు. కానీ చెరువులో చేసేటపుడు గోచీ కట్టుకోవాలి కదా. కొందరి భాషకు అయితే.. కనీసం ఆ గోచీ కూడా ఉండట్లేదు" అంటూ దేవీ ప్రసాద్ అన్న మాటలు ఇన్ డైరెక్టుగా విజయ్ దేవరకొండను ఉద్దేశించినవే.