హీరోగా కాజల్.. అబ్బే జస్ట్ రూమరే!!

Update: 2017-03-03 16:58 GMT
మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నంబర్ 150లో నటించిన తర్వాత.. కాజల్ మరింత స్పీడ్ చూపించేస్తోంది. తమిళ్ లో అజిత్ తో వివేగం.. విజయ్ 61 మూవీల్లో నటిస్తున్న చందమామ.. తెలుగులో రానాతో కలిసి నేనే రాజు నేనే మంత్రిలో నటిస్తోంది. ఇప్పుడీ భామకు మరో సినిమాలో హీరో ఆఫర్ వచ్చిందనే టాక్ పై.. ఆ దర్శకుడు స్పందించాడు.

డీకే డైరెక్షన్ లో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాని నడిపించే రోల్ లో కాజల్ కనిపించనుందనే టాక్ ఉండగా.. దాన్ని ఖండించాడు దర్శకుడు. 'కచ్చితంగా కాజల్ మాకు మొదటి ఛాయిస్. అయితే ఆమె ఇంకా సైన్ చేయలేదు. నిజానికి ఈ ప్రాజెక్టు కోసం ఇంకా ఏ హీరోయిన్ ఫైనల్ కాలేదు. అన్నీ డిస్కషన్ స్టేజ్ లో మాత్రమే ఉన్నాయి' అని చెప్పాడు డీకే. కాజల్ అగర్వాల్ తో నటింప చేసేందుకు ప్రయత్నాలు జరుగతున్నాయనే మాటను మాత్రం ఒప్పుకున్నాడు డీకే.

అసలు ఈ ప్రాజెక్టును నయనతార కోసం రూపొందించారనే టాక్ ఉంది. నయన్ కోసం తాను స్క్రిప్ట్ రాసేందుకు ప్రయత్నించిన మాట వాస్తవమే అన్న డీకే.. ఇది ఆ ప్రాజెక్ట్ కాదంటున్నాడు. అనుకున్న టైంకు స్క్రిప్ట్ సిద్ధం చేయలేకపోవడంతో.. నయన్ తో సినిమా ఆగిపోయిందట. ఇది వేరే స్క్రిప్ట్ కాగా.. ఈ చిత్రం కోసం కాజల్ ను ఫైనల్ చేసే ప్రయత్నాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News