టాలీవుడ్ స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `బిజినెస్ మేన్` ఎంతటి సంచలనమో తెలిసిందే. ఆ సినిమా జయాపజయాల మాట ఎలా ఉన్నా.. అందులో డైలాగుల్ని మహేష్ అభిమానులు పదే పదే వల్లిస్తూ వేడెక్కించారు. పోకిరి తర్వాత మళ్లీ ఆ రేంజులో పాపులరైన డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయి. ఎయిమ్ ఫర్ లెవంథ్ మైల్!! అంటూ పూరి తన కసిని అంతా కలంలోకి సిరాలా ఎక్కించి రాశాడు. ఆ స్ఫూర్తితో ఆ తర్వాత అదే తరహా సినిమా తీసిన వర్మ దెబ్బ తిన్నాడు. ఇంచుమించు అదే లైన్ తో జేడీ ప్రధాన పాత్రలో ఆర్జీవీ `సత్య-2` చిత్రాన్ని తీసి దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. అయినా ఇప్పటికీ `బిజినెస్ మేన్` ఎందరో నవతరం దర్శకులకు స్ఫూర్తిగా నిలుస్తోందన్న నిజం ఇప్పటికి బయటికి వచ్చింది.
ఇప్పుడు పూరి జగన్నాథ్ శిష్యుడు గోపి గణేష్ ఇంచుమించు అలాంటి ప్రయత్నమే చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అతడు తెరకెక్కించిన తాజా చిత్రం `బ్లఫ్ మాస్టర్` ఈనెల 28న థియేటర్లలో రిలీజ్‌కి వస్తోంది. జ్యోతిలక్ష్మి ఫేం సత్య ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజైంది. ``మోసపోయేవాడుంటే మోసం చేసేవాడుంటాడు!`` అంటూ అదిరిపోయే కథనాన్ని గోపి గణేష్ రాసుకున్నాడట.
అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ ని ఆయన ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అసలు ఈ సినిమా తీసేందుకు స్ఫూర్తి బిజినెస్ మేన్ సినిమా. గురువుగారు పూరి తీసిన ఆ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ స్ఫూర్తితోనే తీశాను.. అని గోపి గణేష్ తెలిపారు. బిజినెస్ మేన్‌లో హీరో బ్యాంగ్ ఓపెన్ చేసినప్పుడు హీరోకి, కమీషనర్ కు మధ్య ఓ చిన్న డిస్కషన్ నడుస్తుంది. దాని ఆధారంగానే సోసైటీలోని మరో కోణంలో కథను తయారు చేసుకున్నానని తెలిపారు. ఇక ఈ సినిమా కథ ఓ కామన్ మేన్ కథ. దీని హీరోని వెతికేప్పుడు నలుగురు హీరోలు వచ్చి వెళ్లిపోయారట. ఒక హీరోకి అడ్వాన్స్ ఇచ్చాక కూడా కొన్ని చికాకులు తలెత్తాయి. హీరో కోసం కథను మార్చాల్సిన సన్నివేశం తలెత్తింది. దీంతో చిరాకు పుట్టి ప్రాజెక్టును మధ్యలో వదిలి వెళ్లిపోయానని గోపి షాకింగ్ నిజాన్ని తెలిపారు. అయితే ఆసక్తికరంగా ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ `చతురంగ వేట్టై`కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.