క‌ల‌గ‌ని ఆ సినిమా తీశాడు కానీ!!

Update: 2019-03-06 10:57 GMT
క‌ళ్యాణ్ రామ్ 118  రిజ‌ల్ట్ ఏంటి అన్న‌ది ఇంకా పూర్తిగా తేలలేదు. మిక్స్ డ్ స్పంద‌న‌తో సినిమా ర‌న్ అవుతోంది. అయితే ఈ సినిమా క‌థ ఓ రియ‌ల్ ఇన్సిడెంట్ నుంచి పుట్టింది? అని చెప్పుకోవ‌డం ఆస‌క్తిక‌రం. ఇంత‌కీ ఈ క‌థ ఎలా పుట్టింది? అని ద‌ర్శ‌కుడు గుహ‌న్ ని అడిగేస్తే.. ఓరోజు ఓ హోట‌ల్లో అనుకోకుండా ఓ క‌ల‌గ‌న్నాడట‌. ఆ క‌ల‌నే సినిమా తీసేశాడు. త‌న మొద‌టి చిత్రానికి గుహ‌న్ స్వ‌యంగా క‌థ రాసుకుని, ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్వ‌త‌హాగా సినిమాటోగ్రాఫ‌ర్ అయిన గుహ‌న్ కి ఆ క‌ల రావ‌డం ద‌ర్శ‌కుడిగా ట‌ర్న్ తిప్పిందిట‌.

ఒక భారీ భ‌వంతి.. అందులో హోట‌ల్ రూమ్.. ఆ రూమ్ నం.118. ఆ రూమ్ లో నిదురిస్తే ఏదో పీడ‌క‌ల‌. ఆ క‌ల‌లో ఎవ‌రో అమ్మాయిని కొంద‌రు చంపేసారు. ఆ క‌ల ప‌దే ప‌దే త‌న‌ని వెంటాడి వేధిస్తే అది రియ‌ల్ గా జ‌రిగింద‌ని ప‌రిశోధించే హీరో క‌థ‌ను ఎంచుకుని హిట్టు కొట్టేవాడు గుహ‌న్. అయితే ఈ క‌థ రాసుకోవ‌డానికి స్ఫూర్తి ఏంటి? అని నేడు హైద‌రాబాద్ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌ స‌మాధాన‌మిచ్చారు గుహ‌న్.

అదంతా నేను క‌న్న క‌ల‌. రెగ్యుల‌ర్ గా షూటింగుల కోసం ఎక్క‌డెక్క‌డికో వెళుతుంటాం. అక్క‌డ హోట‌ళ్ల‌లో బ‌స ఏర్పాటు చేస్తుంటారు. ఒంట‌రిగా నిదురించాలంటే భ‌యం. అలా ఓసారి ఓ హోట‌ల్లో ఒంట‌రిగా నిదురిస్తున్న‌ప్పుడు అనుకోకుండా ఓ క‌ల వ‌చ్చింది. ఆ క‌ల‌లో ఎవ‌రో అమ్మాయిని చంపేసారు. ఆ చంపేసింది ఎవ‌రో కాదు నేనే. ధ‌డేల్ మ‌ని నిదుర లేచి చూస్తే అది క‌ల అని అర్థ‌మైంది. హ‌మ్మ‌య్య‌! అనుకున్నా. ఆ క‌ల స్ఫూర్తితోనే 118 క‌థ రాసుకున్నాన‌ని టాప్ సీక్రెట్ ని రివీల్ చేశాడు. నా జీవితంలో ఇలాంటి డ్రామా జ‌రిగి ఉంటే ఎలా ఉండేదోన‌ని అనిపించింది. అందుకే దానిని క‌థ‌గా రాసుకున్నాన‌ని తెలిపారు. నిజానికి ఆరోజు ఆ క‌ల‌ను రియ‌ల్ గా జ‌రిగిందేన‌ని భ‌య‌ప‌డిపోయాను అని అన్నారు. ఆ త‌ర్వాత వేరొక ఇన్సిడెంట్. ఓ సీబీఐ ఆఫ‌స‌ర్ ఫోన్ చేసి ఒక అమ్మాయి విష‌యంలో క్రైమ్ జ‌రిగింది. మీరు ఓసారి స్టేష‌న్ కి రావాలి? అన్నారు. దాంతో మ‌రోసారి గుండె జారింది. మొత్తానికి ఇలాంటి అనుభ‌వాల్ని క‌థ‌లో చేర్చాన‌ని గుహ‌న్ తెలిపారు.

ఈ చిట్ చాట్ లోనే మ‌రోసారి అదే హోట‌ల్ రూమ్ కి వెళ‌తారా?  వెళ్లి సీక్వెల్ క‌థ రాస్తారా? అంటే బాబోయ్ ఆ ప‌ని చేయ‌ను అని న‌వ్వేసారు గుహ‌న్. మొత్తానికి ఆ క‌ల అత‌డిని వెంటాడితే వెంటాడింది కానీ, గుహ‌న్ కి 18- 19 ఏళ్ల క‌ల‌ని నెర‌వేర్చింది. అంటే 19 ఏళ్లుగా ద‌ర్శ‌కుడ‌వ్వాల‌నుకుని ఉపాధి కోసం.. ఎగ్జిస్టెన్సీ కోసం అవ‌కాశం వ‌చ్చింది క‌దా! అని సినిమాటోగ్రాఫ‌ర్ గానే మిగిలిపోయాడ‌ట. అన్న‌ట్టు 118 హిట్ట‌య్యిందా? అంటే లేదు కానీ పేరొచ్చంద‌ని చెబుతున్నారు. పంపిణీదారుల‌కు లాభాలు తెస్తుందా? అంటే సందేహ‌మేన‌న్న ముచ్చ‌టా వినిపిస్తోంది. కాన్సెప్టు బావున్నా.. కొన్ని త‌ప్పులు ఇబ్బంది పెట్టాయ‌న్న విమ‌ర్శ‌లు క్రిటిక్స్ నుంచి వ‌చ్చాయి.


Tags:    

Similar News