యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత 'విక్రమ్'తో ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి తమిళ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ లో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ మూవీ రెండు భాషల్లోనూ సంచలన విజయాన్ని సాధించిన రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఈ మూవీ అందించిన సక్సెస్ చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇదిలా వుంటే ఈ మూవీతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ తన మనసులో మాటని బయటపెట్టడం విశేషం. లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ 'కమల్ హాసన్ కు నేను వీరాభిమానిని, ఆయపతో సినిమా చేయాలనే నా కల 'విక్రమ్'తో నెరవేరింది. ఈ సినిమా సక్సెస్ నా కెంతో ఆనందాన్ని కలిగించింది. 'విక్రమ్' మూవీ చూసిన తరువాత హీరో విజయ్ 'మైండ్ బ్లోయింగ్' అంటూ మెసేజ్ పెట్టారు.
ఇదిలా వుంటలే సూపర్ స్టార్ రజనీ సార్ ఈ మూవీని రెండు సార్లు చూశారట. నన్నెంతో మెచ్చుకున్నారు' అని తెలిపారు. అంతే కాకుండా ఇటీవల తాను చూసిన సినిమా గురించి కూడా చెప్పుకొచ్చారు లోకేష్ కనగరాజ్. రీసెంట్ గా తను మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీని చూశారట. ఈ మూవీని తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచనలో తాను వున్నానని, ఈ మూవీని సూర్య, కార్తీలతో చేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో కార్తీ, బీజు మీనన్ పోషించిన పాత్రలో సూర్యని చూపించాలనుకుంటున్నానని, అయితే ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం 'ఖైదీ2', విజయ్-67 ప్రాజెక్ట్ లపైనే వుందన్నారు. ఒక సినిమాలోని హీరో, విలన్ పాత్రల్లో ఇద్దరు హీరోలు, అందులో అన్నాదమ్ములు కలిసి నటించడం అన్నది ఇంత వరకు జరగలేదు. అదే జరిగితే ఈ మూవీ సినీ చరిత్రలో సరికొత్త రికార్డుని సృష్టించడం ఖాయం అని కోలీవుడ్ మీడియా చెబుతోంది.
ఇదిలా వుంటే 2019లో కార్తి హీరోగా హీరోయిన్, డ్యూయెట్స్ అంటూ ఏమీ లేకుండా లోకేష్ కనగరాజ్ రొటీన్ ఫార్ములాకు అవేగా వెళ్లి ప్రయోగాత్మకంగా చేసిన సినిమా ఇది. తమిళంతో పాటు తెలుగులోనూ సంచలన విజయాన్ని సాధించిన విజయ్ తో 'మాస్టర్', కమల్ తో 'విక్రమ్' చిత్రాలని రూపొందించే అవకాశాన్ని అందించింది.
రీసెంట్ గా విడుదలైన 'విక్రమ్' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ లో ఇప్పడు టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు. 'ఖైదీ 2' ని వచ్చే ఏడాది పట్టాలెక్కించబోతున్నారు. అంతకు ముందే విజయ్ తో చేయబోతున్న సినిమా పట్టాలెక్కనుంది.