అల్లు అరవింద్ సారథ్యంలో ఇటీవలే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ లోకి అడుపెట్టింది 'ఆహా'. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది. జనాలందరూ బయట తిరిగే పరిస్థితులు లేకపోవం తో ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంకేముంది రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గి, ఇంటర్ నెట్‌లో ట్రాఫిక్ పెరిగింది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లెక్స్‌ల్లో వెబ్ సిరీస్‌లకు మంచి డిమాండ్ పెరిగింది. ఇలాంటి టైమ్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోయారు అల్లు అరవింద్. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లెక్స్ రేంజ్ లో జనాలకు చేరువకాలేకపోయింది. ప్రస్తుతం ‘ఆహా’లో పెద్దగా సినిమాలు లేవు, చూడాలనిపించే వెబ్ సిరీస్‌లు ఇంకా రాలేదు. దాంతో ‘ఆహా’ కోసం వెబ్ సిరీస్‌ల స్క్రిప్ట్‌లను ఎంపిక చేసే బాధ్యత మారుతికి అప్పగించాడట అల్లు అరవింద్.
ఈరోజుల్లో, ‘బస్‌స్టాప్' వంటి యూత్ ఫుల్ మసాలా ఫిల్మ్ తీసిన మారుతి, ఆ తర్వాత రూట్ పూర్తిగా మార్చేసి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ప్రేమ కథాచిత్రమ్, ‘భలే భలే మగాడివోయ్’ నుంచి ‘ప్రతిరోజూ పండగే’ దాకా మారుతి సినిమాలు చాలావరకూ అటు యూత్‌ను, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చాయి. దాంతో మంచి యూత్ ఫుల్ కంటెంట్ ఇవ్వగలడనే నమ్మకంతో ఈ క్వారంటైన్ టైమ్‌లో మనోడితో ఓ మంచి డీల్ కుదుర్చుకున్నారట అల్లు అరవింద్. మారుతి ఇంతకుముందు అల్లువారి చిన్నబ్బాయి శిరీష్‌కు ‘కొత్తజంట’ సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చి పెట్టిన విషయం తెలిసిందే. ఓ మోస్తరు హిట్టు ఖాతాలో వేసిన , ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’ను సూపర్ హిట్ చేసే బాధ్యత తీసుకున్నట్టు సమాచారం. ఈ క్వారంటైన్ టైమ్‌లో ఇంట్లో ఖాళీగా కూర్చున్న మారుతి, తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ పనులను కూడా పక్కనబెట్టి, 'ఆహా' కోసం యంగ్ దర్శకులు రాసిన కథలను వడబోస్తూ ‘ఆహా...’ అనిపించే వెబ్ సిరీస్‌లను ఎంపిక చేసే పనిలో బిజీ అయ్యాడని సమాచారం. ఇదే నిజమై అల్లు అరవింద్ నమ్మకాన్ని నిలబెట్టుకొని మారుతి 'ఆహా' అనిపించుకుంటాడో లేదో చూడాలి మరి.