'ఆహ' ఏ రేంజ్ కి వెళ్లబోతుందనేది ఈ స్టేజ్ చెప్పేస్తోంది

Update: 2021-11-03 03:58 GMT
ఆహా' కొత్త వెర్షన్ తో డిజిటల్ ఆడియన్స్ ను పలకరించనుంది. లేటెస్ట్ టెక్నాలజీతో మరింతగా వినోదాల సందడి చేయనుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై తాము మొదలుపెట్టిన ప్రయాణం .. తమ ఆశయం .. లక్ష్యం .. ఆ దిశగా పడిన అడుగులు పరుగులుగా మారిన తీరును వివరించడానికి నిన్న రాత్రి ఒక ఈవెంట్ ను నిర్వహించారు. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లను మించి ఈ ఈవెంట్ ను ప్లాన్ చేయడం విశేషం. ఆల్రెడీ 'ఆహా' కోసం పనిచేస్తున్న వారు .. కొత్త కాన్సెప్ట్ లతో పలకరించనున్నవారు ఈ వేదికపై .. ఈ వేడుకలో సందడి చేశారు.

ఈ స్టేజ్ పై దర్శకుడు మారుతి మాట్లాడుతూ .. "నిజంగా అక్కడ గ్యాలరీలో కూర్చుంటే 'ఆహా' ఎంత పెద్దది కానుందనేది అర్థమవుతోంది. '2.0' అంటే ఏమిటనేది ఈ స్టేజ్ తోనే చూపించేశారు. బయట నుంచి లోపలి వరకూ జరిగిన అరెంజ్ మెంట్స్ చూశాను .. ఈవెంట్ ను చాలా బాగా చేస్తున్నారు. 'ఆహా' కంటెంట్ డే బై డే ఎలా వస్తుంది .. ఎంత క్వాలిటీగా వెళుతుందనేది అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై మా నుంచి '3 రోజెస్' అనే ఒక షో రానుంది.

ఈ ఫ్లాట్ ఫామ్ కోసం అల్లు అరవింద్ గారు నన్ను అడిగినప్పుడు .. నేను మూవీస్ లో బిజీగా ఉన్నాను గదా అని ఆయనకి ఒక లైన్ చెప్పాను. ఆ లైన్ వినగానే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. చాలా బాగుంది చేద్దామని అన్నారు. అలా ఒక రఫ్ లైన్ చెప్పేసి ఆ తరువాత నా రైటర్ రవికి అప్పగించాను. ఆ రోజు నుంచి వర్క్ మొదలైంది. అప్పటి నుంచి ఏడాదిన్నరగా కష్టపడి చాలా ప్యాషన్ తో ఈ షోను చేశారు. రవి .. మ్యాగీ .. ఎస్.కె. ఎన్. టీమ్ అంతా కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చేశారు.

'3 రోజెస్' డెఫినెట్ గా ఒక బెస్ట్ షో అవుతుందని ష్యూర్ షాట్ గా చెబుతున్నాను. ఎందుకంటే ఎపిసోడ్స్ చూశాను. నేను సినిమా తెస్తే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో .. అంతే ఎంటర్టైన్మెంట్ తో ఉంటూ ఒక మంచి మెసేజ్ ను ఇస్తుంది. ఈ కంటెంట్ ను నమ్మి చేయడానికి అంగీకరించిన పాయల్ కి .. పూర్ణకి .. ఈషా రెబ్బాకి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మంచి హీరోయిన్స్ గా ఆల్రెడీ చేస్తున్నవాళ్లు, ఒక వెబ్ సిరీస్ కోసం అడగ్గానే స్క్రిప్ట్ నచ్చి డేట్స్ ఎడ్జస్ట్ చేసుకుని మరీ చేయడం జరిగింది. తెలుగు వెబ్ సిరీస్ ఇంత క్వాలిటీగా చేస్తారా అని మీరు ఆశ్చర్యపోతారు. మాకు ఎంతగానో సహకరించిన 'ఆహా' టీమ్ కి ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను" అన్నారు.


Tags:    

Similar News