ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రాన్ని మన దేశం తరపున ఆస్కార్ అవార్డ్స్ కు అఫిషియల్ ఎంట్రీగా ఎంపిక చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో రేసులో నిలుస్తుందని అందరూ భావించారు. కానీ ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా.. భారత్ తరపున 'ఛల్లో' అనే గుజరాతీ చిత్రాన్ని ఎంపిక చేసింది. దీనిపై ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భారతదేశం నుండి ఆస్కార్ నామినేషన్ కోసం మాగ్నమ్ ఓపస్ ప్రాజెక్ట్ 'RRR' ను కాదని.. 'ఛల్లో షో' ని ఎంపిక చేసినందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీపై దర్శకుడు ఎన్. శంకర్ తన నిరాశను వ్యక్తం చేశారు. 'ఛల్లో షో' లాంటి చిత్రాలు దక్షిణాదిలో చాలా వచ్చాయని పేర్కొన్నారు. దేశ భక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలు కలిగిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. 'ఛల్లో షో'ని ఏ కోణంలో నామినేట్ చేశారో తెలియదు కానీ.. RRR చిత్రాన్ని పంపకపోవడం మాత్రం తనకు బాధ కలిగించిందని దర్శకుడు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ నోట్ షేర్ చేశారు.
''ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా జ్యూరీ గుజరాతీ చిత్రం 'ఛల్లో షో'ని ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కి నామినేట్ చేసిందని విన్న తర్వాత.. 'ఛల్లో షో' టీజర్ చూడటం జరిగింది. అలాంటి కంటెంట్ చిత్రాలు సౌత్ లో చాలా వచ్చాయి. నేను కూడా ఇండియన్ ఆస్కార్ నామినేట్ కమిటీకి జ్యూరీ సభ్యునిగా.. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి వైస్ చైర్మన్ గా.. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ కమిటీకి జ్యూరీ మెంబర్ గా పని చేశాను''
''ఆరుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో జ్యూరీ మెంబర్ గా.. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్స్ కమిటీ చైర్మెన్ గా పని చేసిన అనుభవంతో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. 'ఆర్ఆర్ఆర్' లో దేశ భక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలు.. ఇండియన్ సినిమా ప్రతిష్టను కాపాడటానికి చిత్ర బృందం చేసిన కృషి మనందరికీ తెలిసిందే. గుజరాతీ చిత్రం 'ఛల్లో షో'ని ఏ కోణంలో నామినేట్ చేశారో తెలియదు కానీ.. RRR చిత్రాన్ని పంపకపోవడం బాధ కలిగించింది'' అని ఎన్. శంకర్ తన ప్రకటనలో రాసుకొచ్చారు.
నిజానికి 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి గ్లోబల్ ఆడియన్స్ మరియు హాలీవుడ్ ప్రశంసలు దక్కిన తర్వాత.. అందరూ ఈ సినిమా కచ్చితంగా పలు విభాగాల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అవుతుందని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు మన దేశం నుంచే అధికారిక ఎంట్రీ దొరక్కపోవడంతో నిరాశ చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు డైరెక్టర్ ఎన్. శంకర్ కూడా నిరాశ చెందినట్లు పేర్కొన్నారు.
కాగా, 1920స్ బ్యాక్ డ్రాప్ లో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో RRR చిత్రాన్ని రూపొందించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ - అజయ్ దేవగణ్ - శ్రియా శరన్ - సముద్రఖని - రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ చిత్రానికి బుర్రా సాయి మాధవ్ సంభాషణలు రాశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో RRR సినిమాని నిర్మించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.