పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని ఇండస్ట్రీలో వున్న స్టార్ డైరెక్టర్లు గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్ లు ప్రకటించి అవి ఎప్పడెప్పుడు సెట్స్ పైకి వెళతాయా అని కొంత మంది దర్శకులు ఎదురుచూస్తుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ మాత్రం పవన్ కల్యాణ్ తో సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టేశాడట. రీసెంట్ గా మహేష్ బాబుతో పరశురామ్ 'సర్కారు వారి పాట' మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది మే లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మహేష్ అభిమానుల్ని ఆశించిన స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది. అ మూవీ తరువాత పరశురామ్ యంగ్ హీరో నాగ చైతన్యతో సినిమా చేయాల్సింది. 'నాగేశ్వరరావు' పేరుతో ఓ కథని ఫైనల్ చేశాడు కూడా.
కానీ మహేష్ కారణంగా తనతో చేయాల్సిన ప్రాజెక్ట్ ని పక్కన పెట్టడంతో చైతూ ఇప్పడు పరశురామ్ ని వెయిటింగ్ లో పెట్టి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో తెలుగు, తమిళ భాషల్లో ద్వి భాషా చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే కర్ణాటకలోని మాండ్య సమీపంలో మొదలైంది. అయితే చిత్ర బృందం కన్నడ వర్గాల మనో భావాల్నిదెబ్బతీసే విధంగా సెట్ ని ఏర్పాటు చేసి అందులో మందు బాటిల్స్ ని అమ్ముతున్న సన్నివేశాల్ని చిత్రీకరిస్తుండటంతో కన్నడ వర్గాలు చిత్ర బృందంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి సినిమా షూటింగ్ అనుమతుల్ని రద్దు చేయించాయి. దీంతో నాగచైతన్య టీమ్ షాక్ కు గురైంది.
ఇదిలా వుంటే చై డేట్స్ లేకపోవడం, వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సమయాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం పరశురామ్ కేటాయిస్తున్నాడట. చాలా కాలంగా పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్న పరశురామ్ తన కోసం టెర్రిఫిక్ స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో వున్నాడట. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే తనతో 'అత్తారింటికి దారేది' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని నిర్మించిన బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించే అవకాశం వుందని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు'ని పూర్తి చేసే పనిలో వున్నాడు. ఆ తరువాత సుజీవ్ ప్రాజెక్ట్ వుంటుంది. దాని తరువాత 'వినోదాయ సితం' రీమేక్ ని పట్టాలెక్కిస్తారు. పరశురామ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.