విశాఖ లో మాటలకందని ఘోరం జరిగిపోయింది. ఎల్.జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విడుదలైన గ్యాస్ కు విగత జీవులుగా చాలా మంది రోడ్లపై పడిపోయారు. ఇప్పటికి 12 మంది మృత్యువాతపడగా.. 200 మంది వరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వైజాగ్ గ్యాస్ లీక్ కాగానే బాధితుల వద్దకు వచ్చి పరామర్శించిన సీఎం జగన్ చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. వైఎస్ జగన్ పేదల విషయంలో చూపిన చొరవ.. కోటి రూపాయల ఆర్థిక సహాయంపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం జగన్ కు సన్నిహితుడైన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా జగన్ ను వేయినోళ్ల పొగిడారు.
పూరి జగన్నాథ్ ట్వీట్ చేస్తూ ‘వైజాగ్ లో గ్యాస్ లీక్ వీడియోలు చూసి చలించిపోయాను. ఆ వీడియోల్లో జనాల బాధ ఇప్పటికి మరిచిపోలేకపోతున్నాను. చనిపోయిన తీరు హృదయవిదారకంగా ఉంది. తక్షణ సహాయం చేస్తూ సీఎం జగన్ గారు కోటి రూపాయలు పరిహారం ప్రకటించినందుకు నిజంగా ఆయనకు సెల్యూట్ చేస్తున్నా. నా వైజాగ్ త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నాను’ అంటూ సీఎం జగన్ ను కొనియాడారు.
కాగా గ్యాస్ బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించిన ఏపీ సీఎం జగన్ నిర్ణయానికి సమాజంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.