మెహ్రీన్ కు డైరెక్టర్ సారీ చెప్పాడు

Update: 2017-11-15 08:49 GMT
సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించడానికి దర్శకుడు సిద్దమైనప్పుడు రాసుకున్న ప్రతి సిన్ ను షూట్ చేస్తాడు. అయితే సినిమా అయిపోయాక ఎడిటర్ తన ఆలోచనతో కత్తెరకు పని చెబుతాడు. అందులో దర్శకుడి పాత్ర కూడా ఉంటుంది. అయితే నటీనటులకు కథను చెప్పినపుడు చెప్పినట్లే తీయాలనే కొన్ని కండిషన్స్ ఉంటాయి. నటీనటులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంతో కష్టపెట్టి సీన్స్ ను చేయించి చివరకు వాటిని కట్ చేయిస్తే ఎవ్వరికైనా నచ్చదు.

అయితే రీసెంట్ గా కేరాఫ్ సూర్య సినిమాలో నుంచి మెహ్రీన్ సీన్స్ ను కూడా ఇదే విధంగా కట్ చేశారు. సినిమాలో నిడివి సమయాన్ని తగ్గించాలని టాక్ రావడంతో దర్శకుడు సుశీంద్రన్ దాదాపు 15 నిమిషాల వరకు తగ్గించాడు. అయితే కట్టింగ్ లో ఎక్కువగా మెహ్రీన్ సీన్స్ ఉన్నాయి. దాదాపు 15 రోజుల వరకు ఎంతో కష్టపడి మెహ్రీన్ ఆ సీన్స్ ను చేసింది. అయితే ఆమె ఎక్కడ హర్ట్ అవుతుందో అని దర్శకుడు సుశీంద్రన్ ముందే ఆమెకు క్షమాపణలు చెప్పేశాడు.   

కొత్త వాళ్లు అయితే పర్వాలేదు. కానీ స్టార్ నటీనటులు అయితే ఇలాంటి విషయాల్లో అస్సలు ఊరుకోరు. ప్రస్తుతం మెహ్రీన్ కూడా స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఆమె సీన్స్ ను మాత్రమే ఎక్కువగా తీసేస్తే కొంచెం నెగిటివ్ టాక్ రావొచ్చు. దర్శకుడైతే సారీ చెప్పాడు మరి అమ్మడు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.   
Tags:    

Similar News