బెల్లంకొండ‌తో తేజ విభేధాలు?

Update: 2019-03-11 06:07 GMT
ద‌ర్శ‌కుడు తేజ మ‌న‌స్త‌త్వం గురించి తెలిసిందే. తాను చేప‌ట్టిన కుందేటికి మూడే కాళ్లు! అన్న చందంగా త‌న‌కు ఏం కావాలో అది తీసుకునేందుకు ఏమాత్రం రాజీకి రాడు. ఈ విష‌యంలో ఎంత `పెద్ద‌`వాళ్ల‌ను అయినా ఎదిరించేందుకు వెన‌కాడ‌డు. అందుకే తేజ‌కు ప్ర‌త్యేకించి ఓ బ్రాండ్ ని క‌ట్ట‌బెట్టింది సినీప్ర‌పంచం. త‌న‌కు ఈ రంగుల ప్ర‌పంచం క‌ట్ట‌బెట్టిన బ్రాండ్ గురించి మీడియాతో మాట్లాడే ప్ర‌తి సంద‌ర్భంలో తేజ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అవ‌న్నీ `ముక్కుసూటిత‌నం` వ‌ల్ల వ‌చ్చిన తిప్ప‌లు అని ఒప్పుకుంటారు ఆయ‌న‌.

2018 -19 తేజ‌కు ఎమోష‌న‌ల్ సీజ‌న్‌. ఈ సీజ‌న్ లోనే ఆయ‌న ప్ర‌తిష్ఠాత్మ‌క ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి త‌ప్పుకున్నారు. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో క‌లిసి ఆ బ‌యోపిక్ స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేశాక‌.. అనూహ్యంగా తాను ఆ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది.  క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్ల‌.. త‌న మొండి ప‌ట్టుద‌ల వ‌ల్ల‌నే ఆ ప్రాజెక్టును వ‌దులుకున్నార‌ని చెబుతారు. అస‌లు బాల‌య్య‌తో తేజ‌కు విభేధాలు ఏంటి? అని ప్ర‌శ్నిస్తే .. ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ సైతం స‌స్పెన్స్ ను మెయింటెయిన్ చేశారే కానీ అస‌లు ఆ విభేధాలేంటో చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే తేజ ఏదైనా టేక‌ప్ చేస్తే త‌న‌కు కావాల్సిన ఔట్ పుట్ కావాల్సిందే.. రాజీకి రాని మ‌న‌స్త‌త్వంతో కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని అంతా మాట్లాడుకున్నారు.

తాజాగా మ‌రోసారి అలాంటి రీజ‌న్ తోనే తేజ పేరు ఫిలింన‌గ‌ర్ గుస‌గుస‌ల్లో వినిపిస్తోంది. ఈసారి యువ‌హీరో బెల్లంకొండ శ్రీ‌నుతోనూ తేజ‌కు చిన్న‌పాటి స్ప‌ర్థ‌లు వ‌చ్చాయిట‌. `సీత‌` సెట్స్ పై నుంచి తేజ వాకౌట్ చేశాడని ప్ర‌చారం సాగుతోంది.  మ‌న‌స్ఫ‌ర్థ‌లే ఇందుకు కార‌ణం. తాను గ‌డ్డం పెంచాల్సిందిగా కోరితే ఆ ప‌నిని యువ‌హీరో చేయ‌లేక‌పోయాడ‌ట‌. దాంతో తేజ సీరియ‌స్ అయ్యి సెట్స్ నుంచి వాకౌట్ చేశాడ‌ని తెలుస్తోంది. అయినా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఆగదు.. మొత్తం పూర్తి చేస్తాన‌ని తేజ అన్నారట‌. మ‌రి బెల్లంకొండ శ్రీ‌నివాస్ గెడ్డం పెంచుతున్నారా? అంటే అదేం లేదు. ఆ గ‌డ్డాన్ని సీజీ వ‌ర్క్ లో మ్యానేజ్ చేస్తార‌ట‌! అంటూ మ‌రో ప్ర‌చారం సాగుతోంది. `సీత` చిత్రీక‌ర‌ణతో పాటు సైమ‌ల్టేనియ‌స్ గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లోనూ తేజ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. సాయి శ్రీ‌నివాస్ - కాజ‌ల్ జంట‌గా న‌టించిన ఈ సినిమా పోస్ట‌ర్లు ఆస‌క్తి పెంచిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 25న ఈ చిత్రం రిలీజ్ కానుంద‌ని ప్ర‌క‌టించారు. డెడ్ లైన్ ప్ర‌కారం రిలీజ్ చేసేందుకు పెండింగ్ ప‌నులు పూర్తి చేస్తున్నార‌ని తెలుస్తోంది.  
    

Tags:    

Similar News