మెగా హీరోతో తేజ చిత్రం!!

Update: 2018-05-23 04:51 GMT
తన ఫామ్ ను క్రేజ్ ను ఫుల్లుగా కోల్పోయిన సమయంలో.. దర్శకుడు తేజ నుంచి వచ్చిన మూవీ నేనే రాజు నేనే మంత్రి. ఈ ప్రాజెక్టుతో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయిన ఈ దర్శకుడు.. బడా ప్రాజెక్టుల్లో వినిపించాడు. అయితే.. ఎంత వేగంగా ఆయా ప్రాజెక్టులలోకి చేరుకున్నాడో.. అంతే వేగంగా బయటకు వచ్చేశాడు కూడా.

మొదటగా తనపై నమ్మకం ఉంచిన సురేష్ ప్రొడక్షన్స్ కే మళ్లీ సినిమా చేస్తానని చెప్పిన తేజ.. వెంకటేష్ తో సినిమాను ప్రారంభించాడు. టెస్ట్ షూట్ పూర్తయ్యాక ఈ సినిమా ఆగిపోయింది. ఇందుకు కారణం.. తాను ఎన్టీఆర్ బయోపిక్ కు వెళతానని తేజ చెప్పడమే. అయితే.. కొన్ని పనులు జరిగి.. సినిమా ఆరంభ వేడుకలలో మాట్లాడిన తర్వాత.. ఎన్టీఆర్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు చెప్పాడు తేజ. మరోసారి రానాతో మూవీ చేయబోతున్నాడని టాక్ వినిపించింది. ఈలోపే ఉదయ్ కిరణ్ లైఫ్ పై.. కాబోయే అల్లుడు అనే టైటిల్ పై మూవీ చేస్తారని మాటలు వినిపించినా.. వీటిని తేజ ఖండించాడు.

ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే నాలుగు ప్రాజెక్టులలో తేజ పేరు వినిపించినా.. ఇవేమీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు  వరుణ్ తేజ్ తో ఓ సినిమాకు తేజ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు చెప్పినట్లు నడుచుకునే హీరో కావడంతో.. వరుణ్ తేజ్ కు తేజకు బాగానే సెట్ కావచ్చు. ఇప్పటికే వరుణ్ తేజ్ కు కథ చెప్పేందుకు తేజ రెడీగా ఉన్నాడు. ఓకే అనుకుంటే తేజ-వరుణ్ తేజ్ చిత్రం గురించి త్వరలోనే అనౌన్స్ మెంట్ రావచ్చు.


Tags:    

Similar News