సాయిపల్లవి ప్రధాన పాత్రగా 'విరాటపర్వం' రూపొందింది. సురేశ్ బాబు - సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. రానా కీ లకమైన పాత్రను పోషించగా, ప్రియమణి .. ఈశ్వరీరావు .. నివేదా పేతురాజ్ .. సాయిచంద్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 17వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి హైదరాబాదులో నిర్వహించారు. వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో వేణు ఉడుగుల మాట్లాడాడు.
"సింహాలు వాటి జీవితచరిత్రని రాసుకోలేనంతవరకూ వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది. మన జీవితాలను మనం ఆవిష్కరించుకోలేనంత వరకూ పక్కవాడు చెప్పిందే మన సంస్కృతి అవుతుంది. ఈ స్పృహతోనే గూడవల్లి రామబ్రహ్మం గారు .. ప్రకాశ్ రావుగారు .. టి. కృష్ణగారు .. సినిమాలు తీశారు. వీళ్లందరి స్ఫూర్తితోనే నా మూలాల్లోకి నేను వెళ్లి నేను తీసిన సినిమా 'విరాటపర్వం'. చాలామంది ఇదేదో ప్రోపగండ సినిమా అనుకుంటున్నారు. నేనెక్కడా వైలెన్స్ ను గ్లామరైజ్ చేయలేదు.
ఈ సినిమాలో మేము ప్రేమ దైవమని చెప్పాము .. మానవ స్వేచ్ఛలో ప్రేమ ఒక భాగమని చెప్పాము. ప్రేమకు మించిన ప్రజాస్వామిక విలువ ఈ భూమిమీద మరేదీ లేదని చెప్పాము. 1990 లో ఏర్పడిన ఒక రాజకీయ సంక్షోభాన్ని కాన్వాస్ గా చేసుకుని, ఆనాటి ఒక ప్రేమకథను ఆవిష్కరించిన సినిమా 'విరాటపర్వం'. పాటకి పల్లవి ఎంత ముఖ్యమో .. ఈ విరాటపర్వానికి సాయిపల్లవి అంత ముఖ్యం. లిరిక్ లేని పాట ఉండదు .. పాటకి లిరిక్ ఎంత ముఖ్యమో .. ఈ సినిమాకి రానాగారు అంత ముఖ్యం. అతను చంద్రుడైతే ఆమె వెన్నెల.
ఈ సినిమాలోని ఎనిమిది కీలకమైన పాత్రలలో ఐదు కీలకమైన పాత్రలు స్త్రీలే పోషించారు. ఒక్కో పాత్ర ఒక్కోదశలో కథను మలుపుతిప్పుతూ వెళుతుంది. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులంతా ఎంతో అంకిత భావంతో పనిచేయడం వలన ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. వీళ్లందరినీ నాకు ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్లు ఇచ్చిన స్వేచ్ఛ కారణంగానే ఈ సినిమాను నేను అనుకున్నట్టుగా తీయగలిగాను. ఈ సినిమా మీ జీవితంలో ఒక గొప్ప జ్ఞాపకంగా మిగులుతుందని నేను హామీ ఇస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.