హీరోయిన్ తో డైరెక్టర్ భార్య ఫైటింగ్?

Update: 2016-06-05 06:24 GMT
తెలుగులో తెగ సినిమాలు చేసేసే ఓ హీరోయిన్ ఉంది. ఈమె ఓ స్టార్ డైరెక్టర్ తో దగ్గరి రిలేషన్ కూడా ఉంది. ఆ హీరోయిన్ తో రెండు బిగ్గెస్ట్ హిట్స్ ఎక్స్ పీరియన్స్ ఈ దర్శకుడికి ఉంది. సౌత్ సినిమాల్లో చేసే అమ్మడు హోటల్ లోనే ఉంటూ తెలుగు సినిమాలు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరి మధ్య అఫైర్ గురించి, అందులో దర్శకుడి భార్య దూరడం గురించి టాలీవుడ్ పెద్ద రచ్చ లాంటి చర్చ జరుగుతోంది.

ఈ స్టార్ డైరెక్టర్ - ఆ హీరోయిన్ కలిసి చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారట. ఆ హీరోయిన్ మోజులో పడిపోయిన ఈ దర్శకుడు అసలు ఇంటికెళ్లడం కూడా మానేశాడట. అసలు విషయం తెలిసిన డైరెక్టర్ భార్య.. కొన్నిసార్లు భర్తను మందలించిందట. గ్లామర్ ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు వస్తూ పోతూ ఉంటాయని తెలిసిన ఆమె.. ముందు జాగ్రత్తపడమని మాటలతోనే చెప్పిందట. అయినా ఆ దర్శకుల వారు ఏ మాత్రం ఖాతరు చేయకపోవడం, నైట్ టైం ఇంటికి కూడా రాకపోవడంతో.. భార్యకు తెగ మండిపోయిందని అంటున్నారు.

చివరకు ఒళ్లు మండిపోయిన ఆమె.. నేరుగా హీరోయిన్ ఉండే హోటల్ కు వెళ్లిపోయి ఆ చెంపా, ఈ చెంపా వాయించేసిందని టాక్. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా ఓ న్యూస్ ఛానల్ చేతిలో ఉందని, కావాలనే ఆ ఫుటేజ్ ని టెలికాస్ట్ చేయకుండా ఆపారని తెలుస్తోంది. ఏ రిలేషన్ అయినా లిమిట్ లో ఉండకపోతే.. ఇలాగే అందరి నోళ్లలో నానాల్సి వస్తుంది. అన్నేసి హిట్లు కొట్టిన దర్శకుడికి ఆ మాత్రం ఎందుకు తెలియలేదో?
Tags:    

Similar News