పవనూ మహేషేనా?? వామ్మో ఆపండి!!

Update: 2015-12-18 19:30 GMT
చివారాకరకు పూరి జగన్‌ కూడా కోన వెంకట్‌ ఫార్ములాకే వచ్చేశాడు. ఆడియన్సును ఎంటర్టయిన్‌ చేయడానికి మన దగ్గర ఏ సీనూ లేకపోతే.. చక్కగా ఒక ఫార్మాట్‌ లో వెళ్లిపోతే బెటర్‌ అనే ఫార్ములాను ఎప్లయ్‌ చేశాడు. లోఫర్‌ లో కూడా అదే తంతు చూపడంతో ఇప్పుడు ఆడియన్సుకు చిరాకు వస్తోంది.

మ్యాటర్‌ ఏంటంటే.. పవన్‌ కళ్యాన్‌ సినిమాలనో మహేష్‌ బాబు సినిమాలనో స్పూఫ్‌ లుగా వాడుకోవడం ఈ మధ్యన అన్ని సినిమాల్లోనూ చూస్తున్న విషయమే. రీసెంటుగా బెంగాళ్‌ టైగర్‌ లో అత్తారింటికి దారేది - శ్రీమంతుడు - తమ్ముడు  సినిమాల స్పూఫ్‌ లను చూశాం. అంతకుముందు చాలా సినిమాల్లో ఆ స్పూఫ్‌ లు ఆల్రెడీ చూశాంలే. ఇప్పుడు రాబోయే సౌఖ్యం సినిమాలో కూడా మళ్లీ అవే చూడబోతున్నాం. కాని అనూహ్యంగా నిన్న పూరి జగన్‌ కూడా సేమ్‌ స్పూఫ్‌ లానే చూపించాడు. లోఫర్‌ కోసం తమ్ముడు - శ్రీమంతుడు సినిమాలను వాడేశాడు. ఎటకారంగా ఉన్నాయిలే ఆ సీన్లన్నీ. కాని ఎన్ని రోజులు ఇలాగే ఈ డూప్లికేటు సీన్లను తీసుకుంటూ పోతారు రాజాలూ?

ఏదో ఒక సినిమాలో వస్తే ఓకె.. కాని అందరూ అదే ఫాలో అవుతుంటే రోతగా ఉంది. ఆపండి బాసూ. స్పూఫ్‌ లు మానేసి కొత్తగా ఏమైనా సీన్లు రాయండి. ఆ త్రివిక్రమ్‌ టైపులో పాత రాజేంద్ర ప్రసాద్‌ సినిమాలను తిరగేసి కొన్ని సీన్లు రాసుకోండి బాబూ. ఓహ్.. ఆయన కూడా బద్దం భాస్కర్‌ తో అత్తారింటికి దారేదిలో గ్లాడియేటర్‌ సినిమా స్పూఫ్‌ చేశాడు కదూ. వామ్మో ఆపండి.
Tags:    

Similar News