సినిమా అనేది రంగుల ప్రపంచం.. అక్కడ విజయమే అంతిమంగా సినీ కళాకారులను బతికిస్తుంది.. నడిపిస్తుంది. ఎప్పుడైతే అపజయాలు పలకరిస్తాయో..ఇక ఎంత హీరో అయినా.. దర్శకుడు అయినా కనుమరుగైపోవాల్సిందే..
ఒకప్పుడు హిందీ చిత్రసీమను ఏలిన బాద్ షా షారుఖ్ ఖాన్ కు ఇప్పుడు ఒక్క సినిమా హిట్ కోసం ఆపసోపాలు పడుతున్నారు. వరుస ఫ్లాప్ లతో మొత్తం మార్కెట్ పడిపోయి సినిమా వదిలేస్తాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
తెలుగులోనూ దూసుకొచ్చిన కుర్ర హీరోలు ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి వాళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలోనే లేరు. ఇలా సినిమా ప్రపంచంలో సక్సెసే మాట్లాడుతుంది.. వారిని నిలబెడుతుంది.
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకులు ఆ తరువాత ఊహించని విధంగా ఇచ్చిన అట్టర్ ఫ్లాప్స్ తో కనుమరుగైపోతున్నారు. ఇప్పుడు ఆ దిగ్గజ దర్శకులకు ఏ సినిమా హీరో చాన్స్ ఇవ్వడం లేదు. కొంతమంది సినిమాలనే వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
దశాబ్ధాలుగా ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి, సహా నేటి మహేష్ బాబు వరకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చిన సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు ఇప్పుడు ఫ్లాప్ లతో మొత్తం సినిమాలనే వదిలేసి రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. నేటి ప్రేక్షకుల టైమింగ్, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆయన మారకపోవడంతో దర్శకత్వం వదిలేయాల్సిన పరిస్థితి దాపురించింది.
మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్ తో సినిమా తీసిన శ్రీనువైట్లకు ఆగడు తర్వాత హిట్స్ లేక ఇప్పుడు డిజిస్టర్స్ తో ఇప్పుడు ఏ హీరో కూడా ఈయనతో సినిమాలు తీయడానికి ముందుకు రావడం లేదు.
మాస్ దర్శకుడు వినాయక్... చిరంజీవి సహా ఎంతో మంది ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఇప్పుడు వరుస ఫ్లాప్ లతో ఇక సినిమా దర్శకత్వం వదిలేసి ఇప్పుడు హీరోగా ట్రై చేస్తున్నాడు.
వెంకటేశ్, మహేష్ లతో సీతమ్మ వాకిట్లో లాంటి భారీ మల్టీస్టారర్ తీసిన శ్రీకాంత్ అడ్డాల 'బ్రహ్మోత్సవం' భారీ ఫ్లాప్ తో ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
సమర సింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దర్శకుడు బి. గోపాల్ ఆ తరువాత వరుస ఫ్లాప్ లతో ఇప్పుడు ఇండస్ట్రీలోనే లేకుండా పోయారు.
ఇక బిల్లా సినిమాతో ఇండస్ట్రీలో హిట్ కొట్టిన దర్శకుడు మెహర్ రమేష్ తర్వాత శక్తి, షాడో సినిమాల డిజాస్టర్స్ తో ఇండస్ట్రీకే దూరమయ్యాడు. ఆయనతో ఇప్పుడు ఏ నిర్మాత సినిమాలు తీయడం లేదు.
ఎన్నో క్లాసిక్ మూవీలు తీసిన విలక్షణ దర్శకుడు కృష్ణవంశీది ఫ్లాప్ లతో ఇప్పుడూ అదే పరిస్థితి. వీరే కాదు దర్శకులు దశరథ్, కరుణాకర్, గుణశేఖర్ లాంటి సీనియర్ దర్శకులు కూడా మొదట్లో హిట్స్ ఇచ్చి ఆ తరువాత వరుస ఫ్లాప్స్ తో ఇప్పుడు ఇండస్ట్రీకే దూరమైన పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని బట్టి విజయమే సినిమా ఇండస్ట్రీ లో దర్శకులను బతికిస్తుంది.. బతకనిస్తుందన్న అని నిరూపితమైంది.కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ఈ నానుడిని అందిపుచ్చుకొని ఆధునిక సమాజ పోకడలకు అనుగుణంగా ట్యూన్ అయిపోయి మారిన దర్శకులే ఇప్పుడు ఇండస్ట్రీ లో నిలబడుతున్నారు. పాత చింతకాయపచ్చడి కథలనే వండివారుస్తున్న వారంతా కనమరుగు అవుతున్నారు. సో దర్శకులు మారాల్సిన టైం వచ్చేసిందన్న మాట..