'వరుడు సినిమాకి 80% నష్టపోయా.. మహేష్ మాత్రమే డబ్బులిచ్చి ఆదుకున్నాడు'

Update: 2021-05-26 11:30 GMT
ఒక సినిమా హిట్ అయితే దాన్ని నమ్ముకొని వర్క్ చేసిన వాళ్ళందరి లైఫ్ బాగుంటుంది. అదే ప్లాప్ అయితే కొందరి లైఫ్ తలక్రిందులు అవుతుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ పెట్టి స్టార్ హీరోలతో చేసే సినిమాల విషయంలో ఇలాంటివి చూస్తుంటాం. హిట్ అయితే ఓకే కానీ, అదే డిజాస్టర్ అయితే మాత్రం నిర్మాతలు - డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాలని చవిచూడాల్సి వస్తుంది. దాని ప్రభావం నుంచి కోలుకోడానికి చాలా సమయమే పడుతుంది. అయితే తమ సినిమాల వల్ల నష్టపోయిన వారికి అండగా ఉండేందుకు కొందరు హీరోలు మాత్రమే ముందుకొస్తుంటారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే తన సినిమా వల్ల నష్టం వచ్చిన వారికి డబ్బులు వెనక్కిచ్చి ఆదుకుంటారని.. 'వరుడు' చిత్రానికి 80% నష్టపోయాయని అభిషేక్ ప్రొడక్షన్స్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''వరుడు''. భారీ సెట్స్ తో భారీ బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యూనివర్సల్ ప్రొడక్షన్ లో డివివి.దానయ్య నిర్మించారు. హీరోయిన్ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ బాగా హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. డీవీవీ దానయ్య వద్ద ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అభిషేక్ ప్రొడక్షన్స్ వారు తీసుకున్నారు. దాదాపు 30కోట్లకు పైగానే ఖర్చు చేసి తీసిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అంతకంటే ఎక్కువ ధరకు తీసుకొని విడుదల చేశారు. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. 'వరుడు' సినిమాకి గాను 80% నష్టపోయినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డిస్ట్రిబ్యూటర్ అభిషేక నామా వెల్లడించారు.

''కొందరు ప్రొడ్యూసర్స్ ఈ సినిమా లాస్ అయింది కదా అని మరో సినిమా ఇచ్చి రికవరీ చేసుకోమనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు కొన్నావ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు మాత్రమే కొన్ని సినిమాలు లాస్ వస్తే పిలిచి డబ్బులు రిటర్న్ ఇచ్చారు. వేరే హీరోలు ఎవరూ అలా చేయలేదు. మహేష్ సొంత సినిమా కాకపోయినా నష్టం వస్తే మనీ వెనక్కి ఇవ్వడమే కాకుండా తరువాత సినిమాలు ఇప్పించారు. డిస్ట్రిబ్యూటర్ కి నిర్మాతకి లాస్ వచ్చింది కదా.. మనం హెల్ప్ చేయాలని హీరోలకు అనిపించాలి'' అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా చెప్పారు.
Tags:    

Similar News