సినిమా ఏదైనా సరే.. విడుదలైన గంటల వ్యవధిలోనే ఇష్టారాజ్యంగా కామెంట్ చేసే తత్త్వం ఉన్న దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ముందుంటారు. వందల మంది పని చేసిన ప్రాజెక్టుకు సంబంధించి మనసుకు తోచినట్లుగా చెబితే.. దాని ప్రభావం కోట్లాది రూపాయిల మీద పడుతుందన్న ఫీలింగ్ వర్మలో కనిపించదు. రివ్యూ రాసేవాళ్లు.. మీడియా వాళ్లకు లేకపోవటంలో అర్థం ఉంది కానీ.. వర్మ లాంటి సినీ జీవికి అలాంటివేమీ లేకపోవటం ఏమిటంటూ పలువురు తప్పు పడుతుంటారు.
అయితే.. వర్మ మాత్రం దాన్ని సమర్థించుకుంటారు. తన మనసుకు నచ్చింది చెప్పానంటాడు. మరి.. ప్రతి సినిమాలోనూ బొక్కలు వెతికేసే పెద్ద మనిషి.. సినిమా మీదా.. టెక్నాలజీ మీద మాగొప్ప పట్టు ఉందని చెప్పే వర్మ తాను తీసిన సినిమాల్ని ఎందుకంత దరిద్రంగా.. ఛండాలంగా తీస్తారన్నది అర్థం కాదు.
తాను తీసిన సినిమాను తిరిగి చూసుకోవటం తనకు నచ్చదంటూ గొప్పగా చెప్పుకునే వర్మ సినిమా అంటేనే ఇప్పుడు భయపడే పరిస్థితి. అందుకు తగ్గట్లే ప్రముఖ హీరోలు ఎవరూ వర్మతో సినిమాలు తీసేందుకు ముందుకు రావటం లేదు. ఇలాంటి వేళ.. అనుకోని రీతిలో కింగ్ నాగ్ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. నాగ్ ఇచ్చిన అవకాశాన్ని వర్మ ఎలా వినియోగించుకుంటాడన్న దానిపై పెద్ద చర్చే జరిగింది. అయితే.. వర్మ తన ధోరణిని మార్చుకోలేని వైనం ఆఫీసర్ చెప్పేసింది. ఈ సినిమా డిజాస్టర్ కావటం ఒక ఎత్తు అయితే.. వర్మ తనను అడ్డంగా బుక్ చేశాడంటూ ఒక వ్యక్తి చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకారం.. ఆఫీసర్ షూటింగ్ సమయంలో సుబ్రమణ్యం అనే వ్యక్తి నుంచి వర్మ రూ.1.30కోట్లు ఫైనాన్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని వర్మను అడిగితే కోర్టుకు వెళ్లాలని చెప్పారని చెబుతున్నాడు. కోర్టుకు వెళితే ఇష్యూ తేలటానికి చాలా టైం పడుతుందన్న ఉద్దేశంతో తనకు డబ్బులు వద్దని.. గోదావరి జిల్లా రైట్స్ కావాలని కోరినట్లుగా పేర్కొన్నారు. అయితే.. గోదావరి జిల్లా రైట్స్ కాకుండా ఆంధ్రా రైట్స్ మొత్తం తీసుకోవాలని సూచించారట. మరో ఆప్షన్ లేకపోవటంతో రూ.3.5కోట్లు ఖర్చు పెట్టి మరీ సినిమా హక్కుల్ని తీసుకున్నారు.
సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ రావటంతో కనీస కలెక్షన్లు కూడా రావట్లేదట. దీంతో.. భారీ నష్టాలు తప్పవని చెబుతున్నారు. నాగ్ మూవీ కావటంతో మంచి లాభాలు వస్తాయనుకున్న దానికి భిన్నంగా భారీ నష్టాలు రావటంతో తనకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని సుబ్రమణ్యం వాపోతున్నారు. తన దగ్గర అప్పు తీసుకొని వర్మ తనను అడ్డంగా బుక్ చేసినట్లుగా ఆయన వాపోతున్నారు. తనకు న్యాయం జరగకపోతే తనకు ఆత్మహత్య చేసుకోవటం మినహా మరో మార్గం లేదని చెబుతున్న సదరు పంపిణీదారు వేదనపై నాగ్.. వర్మ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.