సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒకటికి మూడు భారీ సినిమాలు నిర్మించింది ‘14 రీల్స్’ సంస్థ. ‘ఓం నమో వేంకటేశాయ’తో ప్రొడక్షన్లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ.. రెండో ప్రయత్నంలోనే ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ అందించింది. ఆ తర్వాత మహేష్ తో ‘1 నేనొక్కడినే’.. ఆగడు... లాంటి భారీ సినిమాలు తీసింది కానీ.. అవి తీవ్ర నిరాశకు గురి చేశాయి. ‘దూకుడు’ కాకుండా ‘లెజెండ్’ మాత్రమే ఈ సంస్థకు పెద్ద విజయాన్నందించింది. ‘1’.. ‘ఆగడు’ సినిమాల దెబ్బకు వీళ్లు కొంత కాలం పాటు ప్రొడక్షన్ ఆపేశారు. మళ్లీ తేరుకుని ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో గాడిన పడే ప్రయత్నం చేసినా.. తర్వాత ‘లై’ దెబ్బ కొట్టింది.
దీంతో ‘14 రీల్స్’ అధినేతల్లో లుకలుకలు మొదలైనట్లున్నాయి. ‘14 రీల్స్’లో కొనసాగుతూనే అనిల్ సుంకర సెపరేటుగా ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ పెట్టి చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడిని పక్కన పెట్టేసి మిగతా ఇద్దరు నిర్మాతలు రామ్ ఆచంట.. గోపీనాథ్ ఆచంట ‘14 రీల్స్ ప్లస్’ పేరుతో బేనర్ పెట్టి ప్రత్యేకంగా సినిమాలు నిర్మించడానికి డిసైడయ్యారు. ఈ బేనర్ మీద వరుణ్ తేజ్ హీరోగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు రామ్-గోపీనాథ్. అనిల్ తో విభేదాల నేపథ్యంలోనే వీళ్లు కొత్త బేనర్ పెట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే అనిల్ మాదిరే చిన్న సినిమాలు తీయడం కోసం ‘14 రీల్స్ ప్లస్’ బేనర్ పెట్టారని.. మళ్లీ ఏదైనా పెద్ద సినిమా చేయాలంటే ముగ్గురూ కలిసి ‘14 రీల్స్’ మీదే సినిమా చేస్తారని కూడా అంటున్నారు. ఇందులో ఏది నిజమో కానీ.. ప్రస్తుతానికి రామ్-గోపీ.. అనిల్ విడివిడిగా సినిమాలు చేస్తున్న మాట వాస్తవం.