సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి అయిన వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తన పేరుతో అక్కినేని పదం ను జత చేసింది. సమంత అక్కినేని అంటూ పిలిపించుకున్న విషయం తెల్సిందే. సమంత తన సోషల్ మీడియా పేజ్ ల్లో నుండి అక్కినేని పేరును తొలగించడం చర్చనీయాశం అయ్యింది. ఆ సమయంలో ఇద్దరి మద్య ఏదో జరుగుతుందనే వాదన చేశారు. కాని పేరు మార్చితే విభేదాలు ఏంటీ అంటూ కొందరు అనుకున్నారు. చివరకు కొందరు భావించిందే నిజం అయ్యింది. ఆమె చైతూతో విభేదాల కారణంగా పేరును తొలగించినట్లుగా తేలిపోయింది. ఇద్దరు కూడా తాము చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి విడి పోతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు అదే సంఘటన పునరావృతం కాబోతున్నట్లుగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
ఇటీవల సమంత తన అకౌంట్ పేరు మార్చినట్లుగానే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా తన అకౌంట్ లో నుండి భర్త పేరును తొలగించి కేవలం ప్రియాంక చోప్పా అని మాత్రమే ఉంచింది. పేరు మార్చడంతో అసలేం జరుగుతోంది అంటూ అంతా కూడా కిందా మీద అవుతున్నారు. మొన్నటికి మొన్న కూడా బాగానే ఉన్నారు. దీపావళి కూడా సంతోషంగా చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరి మద్య ఏం జరిగి ఉంటుంది.. ఇంతలో ఇద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి వారు ఊహించేసుకుంటూ ఉండగా ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా క్లారిటీ ఇచ్చారు.
జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియా పుకార్లను కొట్టి పారేశారు. ప్రియాంక చోప్రా మరియు నిక్ ల మద్య విభేదాలను ఆమె కొట్టి పారేసింది. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఎలాంటి విభేదాలు ఇద్దరి మద్య లేవు. మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే. సోషల్ మీడియా అకౌంట్ పేరు మార్పు విషయంలో మాత్రం ఆమె అధికారికంగా స్పందించలేదు కాని పేరు మార్చితే విడాకులు తీసుకున్నట్లేనా.. విడాకులు తీసుకుంటారా అన్నట్లుగా ఆమె ప్రశ్నించిందట. మొత్తానికి మన గ్లోబల్ స్టార్ వైవాహిక బంధం అంతా హ్యాపీగానే ఉందని.. ఆమె పేరు మార్పుకు కారణం భర్తతో విభేదాలు కావని తేలిపోయింది. ఈ విషయమై ప్రియాంక చోప్రా స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.