కరోనా విష ప్రచారంపై శపించిన టీవీస్టార్

Update: 2020-03-31 03:30 GMT
కరోనాపై విష ప్రచారం చేసే వారికి కూడా కరోనా సోకి నాశనమై పోతారని తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ శపించారు. ఇప్పుడు మరో టీవీ స్టార్ కూడా తమ కుటుంబానికి కరోనా సోకుతుందని విష ప్రచారం చేసిన నెటిజన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులుగా మానవత్వాన్ని చాటండంటూ హితవులు పలికారు.

ప్రముఖ టీవీ నటి దివ్యాంక  త్రిపాఠి  సోదరుడు విమాన పైలెట్. తండ్రి మెడికల్ షాప్ యజమాని. వీరిద్దరూ ప్రజల కోసం సేవలందిస్తున్న వారే.. అయితే తాజాగా విమాన పైలెట్ గా చేస్తున్న తన సోదరుడితోపాటు తల్లికి కూడా కరోనా సోకిందని సోషల్ మీడియాలో కొందరు విష ప్రచారం చేయడంతో దివ్యాంక భగ్గుమంది. వారిని ఎండగట్టింది.

నా సోదరుడికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. సోకలేదు.విదేశాల నుంచి మన భారతీయులను తీసుకొస్తూ దేశ సేవ చేస్తున్నాడు. ఇక తన తండ్రి ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ తన జీవితాన్ని ఫణంగా పెట్టి మెడికల్ స్టోర్ నడుపుతూ ప్రజలకు ఔషధాలు అందిస్తున్నారు. మాకు ఎవరికి కరోనా రాలేదు. ఇలా మాపై కరోనా ముద్రవేసి వెలివేయకండి.. గౌరవంగా బతకనివ్వండి.. ప్రజలకు సేవ చేస్తున్న యోధులకు గౌరవం ఇవ్వండి అని దివ్యాంక ఇన్ స్టాగ్రామ్ లో ఘాటుగా పోస్టు పెట్టారు.

ప్రధాని సహా అందరూ కరోనా బాధితులపై వివక్ష తగదని సూచించినా కొందరు మాత్రం కరోనా పేరుతో మనుషులపై విష ప్రచారం చేస్తున్నారు.
Tags:    

Similar News