రవితేజ గారిని క‌ల‌వ‌గానే వెంట‌నే అలా అనేశారు: దివ్యాంశ కౌశిక్‌

Update: 2022-07-24 01:30 GMT
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి అత్యంత బారీ స్థాయిలో నిర్మించిన చిత్ర‌మిది. ఈ మూవీ ద్వారా టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శరత్ మండవ దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటించారు. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ నేపధ్యంలో ఈ మూవీ హీరోయిన్స్ లో ఒకరైన దివ్యాంశ కౌశిక్ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చటించింది. ఆ వివ‌రాలు ఆమె మాట‌ల్లోనే....

`మజిలీ` తర్వాత చాలా గ్యాప్ రావడానికి కారణం ?

కోవిడ్ తో అందరికీ కామన్ గా గ్యాప్ వచ్చింది. దీంతో పాటు తెలుగు భాష‌పై ప‌ట్టు సాధించ‌డానికి ప్ర‌త్యేకంగా తెలుగు క్లాసుల‌తో పాటు డ్యాన్స్ క్లాసులు తీసుకున్నాను. అలాగే నన్ను నేను మలచుకోవడానికి వర్క్ అవుట్స్‌ చేశాను. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఇన్స్టా లో కొన్ని ట్రెడిషినల్ ఫోటోలు పోస్ట్ చేశాను. దర్శకుడు శరత్ గారికి ఆ ఫోటోలు నచ్చి 'రామారావు ఆన్ డ్యూటీ' గురించి చెప్పారు.

శరత్ గారు కథ చెప్పినపుడు మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి?

మొదట నేను రవితేజ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో ఎప్పటినుండో పని చేయాలని వుంది. రవితేజ గారితో స్క్రీన్ పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నా. శరత్ గారు కథ చెప్పినపుడు నా పాత్ర చాలా నచ్చింది. ఇందులో నందిని అనే పాత్రలో కనిపిస్తా. ఒక భార్యగా, తల్లిగా హోమ్లీగా కనిపిస్తా. నా పాత్రలో చాలా పరిణితి వుంటుంది. నాకు చాలా కొత్తగా వుంటుంది. శరత్ గారు చాలా క్లారిటీ వున్న దర్శకుడు. 95లో జరిగే ఈ కథ చాలా బలంగా వుంటుంది. ప్రేక్షకులు కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ తో 'రామారావు ఆన్ డ్యూటీ' థ్రిల్ చేస్తోంది.

రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

రవితేజ గారిని కలవడం నాకు ఒక ఫ్యాన్ మూమెంట్. ఆయన్ని మొదట కలసినపుడు చాలా నెర్వస్ గా ఫీలయ్యా. హలో సర్.. హౌ ఆర్ యు.. అనేలోగా.. ఒక్కసారిగా'' హే కూర్చో..ముంబాయా ఢిల్లీనా ? '' అని హిందీలో ఎంతో హుషారుగా అడిగారు. నా భయం ఒక్కసారిగా పోయింది. ఒక్కసారిగా రిలాక్స్ చేసేశారు. ఆయనతో పని చేయడం గొప్ప అనుభవం. ఆయలో గ్రేట్ ఎనర్జీ వుంది. ఆయన సెట్స్ లో వుంటే అందరికీ ఆ ఎనర్జీ వస్తుంది. ఒత్తిడి లేకుండా సరదాగా గడపడం ఆయన్ని చూసి నేర్చుకున్నా. ఈ సినిమా కోసం స్పెయిన్ లో షూట్ చేశాం. జర్మనీ, పాకిస్తాన్ నుండి వచ్చిన వారు రవితేజ గారితో ఫోటోలు తీసుకున్నారు. ప్రపంచం నలుమూల ఆయన్ని ఇష్టపడే వారు వున్నారు. ఆయనలో ఆ పవర్ వుంది.

ఈ పాత్ర కోసం హోం వర్క్ చేశారా ?

నెలన్నర పాటు యాక్టింగ్ వర్క్ షాప్ లో పాల్గొన్నా. దర్శకుడు శరత్ గారు పాత్రకి సంబంధించిన ప్రతి అంశాన్ని వివరంగా చెప్పేవారు. ప్రతి సీన్ గురించి ముందే చర్చించుకునేవాళ్ళం. ఒక నటిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలనీ వుంటుంది. 'రామారావు ఆన్ డ్యూటీ'లో అలాంటి బలమైన పాత్ర దక్కింది.

సినిమాలో మీ పాత్ర ఎలా వుంటుంది ?

ఇందులో హోమ్లీ గర్ల్, హౌస్ వైఫ్ గా కనిపిస్తా. ఒక భార్యగా రామారావుకి మోరల్ సపోర్ట్, గైడ్ గా ఉంటా.  

`మజిలీ`లో బబ్లీ గర్ల్ గా ఇందులో ఒక వైఫ్ పాత్రలో కనిపిస్తున్నారు కదా.. మీకు ఎలాంటి పాత్రలు చేయడం సౌకర్యంగా వుంటుంది?

బబ్లీ గర్ల్ గా నటించడం సువులుగానే వుంటుంది. కానీ నందిని లాంటి పాత్ర చేయడం నటిగా నాకు తృప్తిని ఇస్తుంది. నందిని పాత్రని చాలా ఎంజాయ్ చేశాను. పెర్ఫార్మ్ చేయడానికి ఎక్కువ స్కోప్ వున్న పాత్రది.  

డబ్బింగ్ మీరే చెప్పారా ?

లేదండీ. ఈ చిత్రానికి చెప్పలేదు. ఇప్పుడు చేస్తున్న మరో చిత్రానికి నేనే డబ్బింగ్ చెఫ్తున్నా. తెలుగు మాట్లాడితే అర్ధం అవుతుంది. ప్రస్తుతం నేర్చుకుంటున్నా. భవిష్యత్ లో నేనే డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తా.

రజిషా విజయన్ గురించి ?

రజిషా విజయన్ మంచి నటి. ఈ చిత్రంలో ఆమె పాత్ర కూడా ఆసక్తికరంగా వుంటుంది. రవితేజ గారికి నాకు తనకి ఒక సీన్ వుంటుంది. చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది. తనతో కలసి ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నా. మేము స్నేహితులయ్యాం.

నాగచైనత్య, రవితేజ గారితో వర్క్ చేశారు కదా.. వారిలో ఎలాంటి డిఫరెన్స్ గమనించారు ?

ఇద్దరు భిన్నమైన వ్యక్తులు. రవితేజ గారు చాలా ఎనర్జీటిక్ గా వుంటారు. నాగచైతన్య కామ్ గా వుంటారు. అయితే ఇద్దరిలో ఒక కామన్ క్యాలిటీ వుంది. సెట్స్ లో సరదా  ఫ్రాంక్స్ చేస్తుంటారు(నవ్వుతూ)

'రామారావు ఆన్ డ్యూటీ' టీంతో ఎలాంటి అనుబంధం వుంది ?

మూడేళ్ళ తర్వాత  'రామారావు ఆన్ డ్యూటీ' లాంటి పెద్ద సినిమా సెట్స్ లోకి వచ్చాను. టీం అంతా చాలా ప్రోత్సాహన్ని ఇచ్చారు. దర్శకుడు శరత్ గారు నటన విషయంలో చాలా స్వేఛ్చని ఇచ్చారు. ఏదైనా సీన్ బాగా చేస్తే మానిటర్ లో చూపించి 'చాలా బాగా చేశావ్' అని మెచ్చుకునే వారు. ఒక వండర్ ఫుల్ ఫిల్మ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.

ఒక దర్శకుడు కథ చెప్పినపుడు ఎలాంటి ఎలిమెంట్స్ చూస్తారు ?

మొదట దర్శకుడి విజన్ ని చూస్తాను. దర్శకుడి విజన్ ని నమ్ముతాను. లక్కీగా ఇప్పటివరకూ మంచి విజన్, క్లారిటీ వున్న దర్శకులతో పని చేశాను.

'రామారావు ఆన్ డ్యూటీ' నిర్మాతల గురించి ?

ఎస్ఎల్వీసి, రవితేజ టీం వర్క్స్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. సినిమాల పట్ల ప్యాషన్ వున్న నిర్మాతలు. సినిమాకు కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా గొప్ప క్యాలిటీతో 'రామారావు ఆన్ డ్యూటీ'ని తెరకెక్కించారు.

ఏ హీరోలతో పని చేయాలనీ కోరుకుంటున్నారు ?

మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, .. అందరి హీరోలతో పని చేయాలని వుంది(నవ్వుతూ)

తెలుగు చిత్ర పరిశ్రమకి బాలీవుడ్ కి ఎలాంటి తేడాలు గమనించారు ?

రెండు పరిశ్రమల్లోనూ సినిమా కోసం చాలా నిబద్దతతో పని చేస్తారు. అయితే తెలుగులో ప్రేక్షకుల పంచిన ప్రేమ మాత్రం చాలా ప్రత్యేకం. మజిలీలో పాత్రని ఎంతగానో ఇష్టపడ్డారు. ఇక్కడ ప్రేక్షకుల ప్రేమని మర్చిపోలేను.

చాలా సన్నబడ్డారు కదా మీ డైట్ సీక్రెట్ ఏమిటి ?

మజిలీలో కొంచెం బబ్లీగా కనిపించా. తర్వాత కొంచెం సన్నబడాలని స్పెషల్ గా డ్యాన్స్ క్లాసులు తీసుకొన్నా. డైట్ ప్లాన్ అంటూ ఏమీ లేదు. ఏది తినాలనిపించేది చక్కగా తినేస్తా.

ఎలాంటి సినిమాలు చేయాలనీ వుంది ?

అన్ని రకాల పాత్రలని చేయగలనే నమ్మకం వుంది. ఏదైనా బయోపిక్ చేసే సామర్ధ్యం వుందని నమ్ముతున్నా.  

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?

సుదీర్ వర్మ గారితో ఒక సినిమా, అలాగే మైఖేల్ అని మరో సినిమా చేస్తున్నా.

అల్ ది బెస్ట్

థాంక్స్.
Tags:    

Similar News