లేటుగా వచ్చినా లేటెస్ట్ రికార్డును సొంతం చేసుకుంది ‘దువ్వాడ జగన్నాథం టీజర్. ప్రస్తుతం తెలుగులో అత్యధిక యూట్యూబ్ వ్యూస్ తెచ్చుకున్న టీజర్ రికార్డు ‘దువ్వాడ జగన్నాథం’దే కావడం విశేషం. ‘కాటమరాయుడు’ పేరిట ఉన్న రికార్డును డీజే టీజర్ దాటేసింది. ప్రస్తుతం (ఈ ఆర్టికల్ రాసే సమయానికి) ‘డీజే’ టీజర్ వ్యూస్ 1 కోటి 14 లక్షల 33 వేలకు పైగా ఉన్నాయి. ‘కాటమరాయుడు వ్యూస్ 1 కోటి 14 లక్షల 18 వేల వద్ద ఉన్నాయి. ‘డీజే’ టీజర్ రావడానికి 20 రోజుల ముందే రిలీజైన ‘కాటమరాయుడు టీజర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత మోగించింది. కోటి వ్యూస్ తెచ్చుకున్న తొలి తెలుగు టీజర్ గా రికార్డు నెలకొల్పింది.
ఐతే ‘కాటమరాయుడు’ రికార్డుల్ని వెంటాడుతూ వెళ్లిన ‘డీజే టీజర్ దానికంటే వేగంగా కోటి వ్యూస్ మార్కును అందుకుని సంచలనం రేపింది. ఇప్పుడు మొత్తంగా ‘కాటమరాయుడు’ వ్యూస్ నే దాటేసింది. ఈ టీజర్ కు ఇప్పటిదాకా 1.9 లక్షల లైక్స్ కూడా వచ్చాయి. తెలుగులో అత్యధిక డిజ్ లైక్స్ రికార్డు ‘డీజే’దే అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘డీజే’ డిజ్ లక్స్ 1.68 లక్షలకు పైగా ఉన్నాయి. ‘కాటమరాయుడు’ టీజర్ కు 2.64 లక్షల లైక్స్.. 47 వేల డిజ్ లైక్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ కు సౌత్ ఇండియా అంతటా మంచి ఫాలోయింగ్ ఉండటం.. డిజ్ లైక్స్ గొడవతో ఈ టీజర్ కు మంచి ప్రచారం లభించడం.. రికార్డుల మోత మోగించడానికి కారణమని చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/