DJ టిల్లు బాక్సాఫీస్ బరిలో సింగంలా గర్జించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైనా అన్ లిమిటెడ్ స్పీడ్ తో `చీటా`లా దూసుకుపోయింది. సిద్ధూ- నేహా శెట్టి జంటకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం AHAలో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా కథానాయిక నేహాశెట్టి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
డీజే టిల్లును ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అవకాశమిచ్చిన సిద్ధు కి దర్శకనిర్మాతలకు థాంక్స్. ఇందులో టిల్లుగాని లవర్ గా నేను రాధిక అనే పాత్రను పోషించాను. ప్రేక్షకులు నన్ను అలాంటి పాత్రలో అంగీకరిస్తారా? అని తొలుత నేను టెన్షన్ పడ్డాను.
సినిమాలో నా నటనను ప్రేక్షకులు ఆదరించి మెచ్చుకోవడంతో ఆనందం కలిగింది. నాకు అద్భుతమైన స్పందన వచ్చింది. ట్రోల్స్ గురించి ప్రస్థావిస్తూ.. మనం అందరినీ మెప్పించలేం అనేది కఠోర సత్యం. మేము చేసే పనిని ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారు. రాధిక పాత్రతో సమస్యలు ఉన్నాయి.
కానీ డీజే టిల్లులో మెజారిటీ ప్రేక్షకులు నన్ను ప్రేమించడంతో నేను ఓకే. రాధిక పాత్రలో నటించేటప్పుడు పెద్ద భయం ఏమిటి అంటే.. నా పాత్ర చాలా ఎడ్జీగా ఉంది. నేను ఒక బీట్ దాటవేసినా.. నా పాత్ర అసభ్యంగా ఉండేది. కానీ అదృష్టవశాత్తూ అలా జరగలేదు. ఆ పాత్రతో వ్యక్తిగతంగా సంబంధం లేకపోయినా చిత్తశుద్ధితో ఆత్మవిశ్వాసంతో నటించాను.
ఈ చిత్రం ఇప్పుడు AHAలో విడుదలైంది.. ఆదరణ బావుంది. కోవిడ్ భయంతో చాలా మంది ప్రేక్షకులు సినిమాను చూడలేకపోయారు. ఇప్పుడు AHAలో విడుదల కావడంతో మరోసారి మంచి బజ్ వచ్చింది. స్పందన చాలా బాగుంది. చాలా మంది మా చిత్రాన్ని మరోసారి చూస్తున్నారు. ఇది నాకు చాలా సంతృప్తిని కలిగిస్తోంది.
ఓటీటీలో నటిస్తారా? అంటే.. ఎందుకు నటించను.. OTT ముందున్న మార్గం .. నేను సినిమాలతో పాటు OTT ప్రాజెక్ట్ లను చేయాలనుకుంటున్నాను. కొంతమంది పెద్ద తారలు ఇప్పుడు దీన్ని చేస్తున్నారు. వారే నాకు స్ఫూర్తి. మంచి పాత్ర లభిస్తే నేను దానిని తప్పకుండా నటిస్తాను... అని తెలిపారు.
సిద్ధు జొన్నలగడ్డ గురించి చెబుతూ.. సినిమా రాకముందు కూడా మేమిద్దరం సన్నిహితులం. DJ టిల్లూ అతడి కోసమే పుట్టింది. ఎందుకంటే అతను దానిని సహ రచయితగా కూడా చేశాడు. సిద్ధు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాడు. అతని కష్టానికి ఫలితం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.
మా కాంబో కూడా ప్రేక్షకులకు నచ్చింది. ఇది నాకు సంతోషాన్ని కలిగించింది. డిజే టిల్లు పార్ట్ 2కి సంబంధించి స్క్రిప్టింగ్ జరుగుతోంది. సీక్వెల్ కోసం ఇంకా నేను వేచి ఉండలేను. కానీ సిద్ధూ తన ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నందున దాని గురించి మాట్లాడటం చాలా తొందరపాటు అవుతుంది.
తెలుగులో ఎలాంటి సినిమాలు చేయాలి? అంటే.. నేను అన్ని రకాల పాత్రలకు సిద్ధంగా ఉన్నాను. అది గ్లామర్ అయినా లేదా పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ అయినా... కొత్త సవాళ్ల కోసమైనా సిద్ధమే. తెలుగులో చాలా మంది మంచి దర్శకులు సాలిడ్ కంటెంట్ ని రూపొందిస్తున్నారు .. సరైన స్క్రిప్ట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను... అంటూ ఎగ్జయిట్ మెంట్ ప్రదర్శించింది.
నటిగా నిరూపించుకోవాలంటే ఈ కొత్తమ్మాయ్ ఇంకా చాలా జర్నీ చేయాల్సి ఉంటుంది. కానీ వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ఎంపికల విషయంలో జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.