సుశాంత్ రాజ్ పూత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆత్మహత్యగానే భావిస్తున్నప్పటికి అందుకు కారణం రియా అంటూ ఆరోపణలు చేస్తున్నారు. పోస్ట్ మార్టంలో ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలింది అంటూ ముంబయి పోలీసులు పేర్కొన్నారు. అయితే బీహార్ పోలీసుల రంగ ప్రవేశంతో ముంబయి పోలీసుల ఎంక్వౌరీ మొత్తం తూతూ మంత్రంగా సాగిందంటూ తేట తెల్లం అయ్యిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సమయంలో డాక్టర్ మీనాక్షి మిశ్రా సుశాంత్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరింతగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రముఖ డెర్మటాలజిస్ట్ మీనాక్షి మిశ్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో సుశాంత్ అభిమానుల్లో సరికొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. సుశాంత్ ముఖం మరియు శరీర ఇతర భాగాలపై గాయాలు ఉండటాన్ని ప్రస్థావించాడు. ఆ విషయాల గురించి ఎందుకు పోస్ట్ మార్టంలో చెప్పలేదంటూ ఆయన ప్రశ్నించాడు. సుశాంత్ ది ఖచ్చితంగా హత్య అయ్యి ఉంటుందని ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారంటూ ఆయన చెప్పుకొచ్చాడు. బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి గత కొన్ని రోజులుగా సుశాంత్ ది హత్య అయ్యి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు డాక్టర్ మిశ్రా కూడా సుబ్రమణ్య స్వామి ట్వీట్ ను రీట్వీట్ చేయడంతో పాటు తన వాదనను వినిపించాడు. దీంతో సుశాంత్ ఆత్మహత్య కేసు కాస్త హత్య కేసుగా మారింది.

Shocking relevations made on Sushant’s case!
— Dr.Minakshi Mishra (@savethesaviours) August 2, 2020
PS: Sensitive Content. pic.twitter.com/r0orseM72b