టాలీవుడ్ కి ఓమిక్రాన్ భ‌యాలు లేన‌ట్టేనా?

Update: 2022-01-03 06:25 GMT
టాలీవుడ్ ని మ‌ళ్లీ కోవిడ్ భ‌యం వెంటాడుతోందా? సెకెండ్ వేవ్ ని మించి థ‌ర్డ్ వేవ్ ప్ర‌మాదం పొంచి ఉంద‌ని భావిస్తున్నారా? ప‌రిశ్ర‌మ క్రైసిస్ లోకి వెళ్లేంత‌గా ఓమిక్రాన్ విస్త‌రిస్తోందా?.. ఇలా ఎన్నో సందేహాలు ఇప్పుడు తెర‌పైకి వ‌స్తున్నాయి. కొవిడ్ ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ గ‌డ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. మొద‌టి వేవ్ అనంత‌రం దేశం లాక్ లోకి వెళ్లిపోవ‌డం..అటుపై సెకెండ్ వేవ్ ఉప‌ద్ర‌వం నుంచి కోలుకుని బ‌య‌ట‌ప‌డానికి ఎంత స‌మ‌యం ప‌ట్టిందో కూడా విధిత‌మే. థ‌ర్డ్ వేవ్ భ‌యాలు దాదాపు తొల‌గిపోయిన‌ట్లేన‌ని అంతా భావిస్తోన్న స‌మ‌యంలో క‌రోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఒక్క‌సారిగా తెర‌పైకి వ‌చ్చింది.

ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌పడిన ఈ న్యూ వేరియంట్ ఇప్పుడు ప్ర‌పంచ దేశాల్ని గ‌డ‌గ‌డ‌లాడించ‌డానికి రెడీ అవుతోంది. ఓమిక్రాన్ కేసులు దేశంలో భారీగా న‌మోదవుతున్నాయి. ఇప్ప‌టికే కొన్ని దేశాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. భార‌త్ లోనే కేసులు సంఖ్య డేబై డే గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. కొన్ని రాష్ర్టాల్లో నైట్ క‌ర్ప్యూలు అమ‌లులో ఉన్నాయి. క‌ర్ణాక‌ట‌...మ‌హారాష్ర్ట‌లో థ‌యేట‌ర్లు 50 శాతం ఆక్యుపున్సీతో..కోవిడ్ నిబంధ‌న‌లతో న‌డుస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ర్టాల‌కు ఓమిక్రాన్ సోకింది. దీంతో ప‌రిస్థ‌ఙ‌తుల్ని బ‌ట్టి ఆయారాష్ర్టాలు మ‌ళ్లీ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే టాలీవుడ్ మ‌రింత న‌ష్టాల ఊబిలో కూరుకుపోతుంద‌న్న ఆందోళ‌న‌లు ఉన్నాయి.

రెండేళ్ల‌గా సినిమాలు లేక ప‌రిశ్ర‌మ‌కి ఆదాయం లేకుండాపోయింది. ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయని అంతా భావిస్తున్నారు. అయితే కొత్త వేరియంట్ కార‌ణంగా మ‌ళ్లీ క‌థ మొద‌టికే వ‌చ్చేలా ఉంద‌ని భ‌యాందోళ‌నలు సినీ పెద్ద‌ల్ని వెంటాడుతున్నాయి. 24 క్రాప్ట్ ల‌కు చెందిన‌ సినీ కార్మికులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. థియేట‌ర్లు మ‌ళ్లీ మూత ప‌డితే ఎప్పుడు తెరుచుకుంటాయో న‌మ్మ‌కంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. దీనికి తోడు ప‌రిశ్ర‌మ‌కి ప్ర‌తికూలంగా ఏపీలో ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

త‌గ్గిన టిక్కెట్ ధ‌ర‌లతో సినిమాలు రిలీజ్ చేస్తే న‌ష్టాలు త‌ప్ప లాభాలు ఎక్క‌డ‌? అని నిర్మాత‌లు..పంపిణీదారులు.. బ‌య్య‌ర్లు..థియేట‌ర్ యాజ‌మాన్యాలు గ‌గ్గోలుపెడుతున్నాయి. క‌నీసం ఈ సంక్రాంతి సీజ‌న్ అయినా ఎన్ క్యాష్ చేసుకుందామ‌ని కొంత మంది ప్లాన్ చేసుకున్న‌ప్ప‌టికీ `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వాయిదా కార‌ణంగా పెద్ద దెబ్బ త‌గిలింది. ఇది ఊహించ‌ని ఘ‌ట‌న‌. ఆ సినిమా యూనిట్ పై ప‌రిశ్ర‌మ వ‌ర్గాలే విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నాయి. ఆ ర‌కంగాను ప‌రిశ్ర‌మ‌లో కొంత ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డింది. ఏది ఏమైనా అన్నింటికి కార‌ణం కంటికి క‌నిపించని ఆ చిన్న వైర‌స్ అన్న‌ది వాస్త‌వంగా భావించాలి. అయితే ఓమిక్రాన్ వ‌ల్ల మ‌ర‌ణాల శాతం ఎక్కువ లేదు అన్న‌దే ఇక్కడ ఊర‌ట‌.

మ‌న‌వ‌ర‌కూ పాజిటివిటీ ఉంది!

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఇంకా స్వేచ్ఛ‌గా తిర‌గ‌డానికి కార‌ణం వైర‌స్ తో ఆందోళ‌న‌లు త‌గ్గ‌డ‌మే. ఓమిక్రాన్ ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న మెడిసిన్ కి లొంగ‌డం.. వ్యాక్సినేష‌న్ తో సుర‌క్షితంగా ఉన్న‌వారికి ఎలాంటి ప్ర‌మాదం లేక‌పోవ‌డం పాజిటివ్ అంశాలు. ఇటీవ‌ల ల‌వ్ స్టోరి- అఖండ‌- పుష్ప‌- శ్యామ్ సింగ‌రాయ్ వంటి చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో టాలీవుడ్ వ‌ర‌కూ కాస్త ఊర‌ట క‌నిపిస్తోంది. వైర‌స్ భ‌యాలు ఉన్నా జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం చాలా వ‌ర‌కూ ధైర్యం నింపుతోంది.
Tags:    

Similar News