ప్రేమమ్ పాప భాషతోనే భయం

Update: 2017-07-04 04:29 GMT
మలయాళ ప్రేమమ్ మూవీతో సాయిపల్లవి సంపాదించిన కీర్తి అంతా ఇంతా కాదు. ఈ సినిమా తెలుగులో అదే పేరుతో వచ్చినా.. తెలుగు జనాలు కూడా ప్రేమమ్ బ్యూటీగా సాయిపల్లవిని గుర్తు పెట్టేసుకున్నారు. ఈమె నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఫిదా. వరుణ్ తేజ్ హీరోగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో.. ఆమె తెలంగాణ అమ్మాయిగా కనిపించనుంది.

ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లు.. తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు సాహసించరు. అందులోనూ తెలంగాణ మాండలికంలో పలకాలంటే.. ఉచ్ఛారణ చాలా అవసరం. సహజంగా అయితే.. ఈ బాధ్యత డబ్బింగ్ ఆర్టిస్టులకు అప్పచెప్పేస్తారు కానీ.. శేఖర్ కమ్ముల మాత్రం సాయి పల్లవితోనే డబ్బింగ్ చెప్పించాడు. ఆమె కూడా బాగానే మెప్పించిందని మేకింగ్ వీడియో చూస్తే అర్ధమవుతుంది. అయితే.. ఎంతవరకూ పూర్తి తెలంగాణ భాషకు ఆమె న్యాయం చేయగలిగిందనే అంశంపై చాలా మందిలో సందేహాలున్నాయి.

వరంగల్ ప్రాంతంలో మాట్లాడే సింపుల్ తెలంగాణ యాసతో పెళ్ళిచూపులు చిత్రాన్ని తెరకెక్కించి.. ప్రేక్షకులను మెప్పించారు. కానీ ఆదిలాబాద్ లో మాట్లాడే గ్రాంధిక తెలంగాణ.. మెదక్ ఏరియాలో వినిపించే గ్రామీణ తెలంగాణ.. అన్నీ కలిపేసి ఫిదాలో వాడేశారు. ఫిదా చిత్రం ఇప్పుడు బజ్ బాగానే ఉన్నా.. తెలంగాణ మాండలికాన్ని సాయి పల్లవి పలకగలగడం.. భానుమతి పాత్రను మెప్పించడమే కీలకం కానుంది. ప్రస్తుతానికి అయితే.. ఈ మూవీపై వినిపిస్తున్న ఒకే ఒక్క నెగిటివ్ ఎక్స్ పెక్టేషన్ ఇదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News